Begin typing your search above and press return to search.

కలను నిజం చేసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

By:  Tupaki Desk   |   9 Feb 2016 1:00 AM IST
కలను నిజం చేసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
X
ప్రతీఒక్కరికీ ఒక్కో కల వుంటుంది. సినిమా హీరోలైనంత మాత్రాన మొహానికి రంగులేసుకునే పనులే చేస్తూ వుండవలసిన అవసరం లేదు. నందమూరి తారక రామారావుగారు సినిమాలలో నటిస్తూనే రాజకీయాలలో విజయంసాధించారు. నాగార్జున మూవీస్ లో దుమ్ము దులుపుతూనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. చరణ్ హిట్లు కొడుతూ తనకిష్టమైన పోలో క్లబ్ ని నిర్వహిస్తున్నాడు.

ఇక యువహీరోలలో అఖిల్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సి.సి.ఎల్ పూర్తయ్యాకే తన రెండవ సినిమా గురించి ఆలోచిస్తా అన్నాడంటే క్రికెట్ పై తనకున్న మక్కువ అర్ధమవుతుంది. అఖిల్ లానే మరో హీరోకి కూడా క్రికెట్ అంటే ప్రాణం. అతనే ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.

అశ్విన్ కి డైరెక్ట్ గా హీరో అవ్వాలనే కలలు లేకపోయినా సి.సి.ఎల్ లో ఆడాలంటే కనీసం మూడు సినిమాలైనా చేసి వుండాలనే నియమం కారణంగా వరుసపెట్టి సినిమాలు చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఓంకార్ దగ్గరుండి రాజుగారి గది - జతకలిసే స్క్రిప్ట్ లు అందించినట్టు సమాచారం. నియమాన్ని అందుకున్న అశ్విన్ సి.సి.ఎల్ ప్రస్తుత సీజన్ లో ఆడి తన కల నిజం చేసుకోవడమేకాక నిన్నటి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సైతం నిలవడం అతని పట్టుదలకు - ప్రతిభకు నిదర్సనం.