Begin typing your search above and press return to search.

'చిరుత' కాంబినేషన్ లో మెగాస్టార్‌ ఫిలిం?

By:  Tupaki Desk   |   12 July 2016 12:06 PM GMT
చిరుత కాంబినేషన్ లో మెగాస్టార్‌ ఫిలిం?
X
మెగాస్టార్‌ చిరంజీవి రీ-ఎంట్రీ మామూలు రేంజులో ఉపందుకోలేదు. చాలామంది దర్శకులూ.. నిర్మాతలూ.. మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరేమో చిరంజీవికి మేం కెరియర్ లో ఎన్నో చేశాం.. మాకెందుకు ఛాన్సివ్వడూ అంటుంటే.. కొందరేమో మరోసారి ఆయనతో పనిచేసే ఛాన్సొస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. అలా కిక్ కోసం చిరంజీవితో సినిమా తీయాలని అనుకుంటున్న వారిలో మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌ కూడా ఉన్నారట.

జగదేకవీరుడు అతిలోకసుందరి - చూడాలని ఉంది - చిరుత.. వంటి మెగా మూవీస్ ఎన్నో ప్రొడ్యూస్ చేసిన అశ్వినీ దత్‌.. ఆ మధ్య శక్తి వంటి సినిమాతో కాస్త గట్టి గట్టి దెబ్బలు తగిలేశాక.. అసలు పెద్ద రేంజ్ సినిమాలేవి నిర్మించలేదు. ఆయన కూతుళ్లు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలను తీస్తూపోతున్నారు. అయితే ఇప్పుడు దత్తు గారు పెద్ద సినిమా తీయాలనే యోచనతో.. ఎలాగో సినిమాల్లోకి మళ్లీ రిటర్న్ వచ్చేశారు కాబట్టి అదేదో మెగాస్టార్‌ చిరంజీవితోనే తీయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఆల్రెడీ పూరి జగన్‌ చెప్పిన ''ఆటో జానీ'' లైన్ చిరంజీవికి నచ్చింది కాబట్టి.. గతంలో పూరి అండ్ చరణ్‌ తో ''చిరుత'' తీసిన ఆయన.. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మణిశర్మను కలుపుకుని మెగా ఆటోను రోడ్డెక్కిద్దాం అని ప్లాన్ చేస్తున్నారట మరి. చూద్దాం ఏమవుతుందో!!