Begin typing your search above and press return to search.

సారా కోసం పెరుగుతున్న ఆరాటం

By:  Tupaki Desk   |   24 Jan 2018 8:49 AM GMT
సారా కోసం పెరుగుతున్న ఆరాటం
X
సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ సినీ రంగ ప్రవేశం ఇప్పటికే ఖాయం అయిపోయింది. ఇప్పటికే కేదార్ నాథ్ మూవీలో నటించేస్తోంది కూడా. ఈ ఏడాది డిసెంబర్ లో సారా ఆలీ ఖాన్ లాంఛింగ్ మూవీగా కేదార్ నాథ్ విడుదల కానుంది. కానీ అప్పుడే ఈమె మరుసటి ప్రాజెక్టులకు రంగం సిద్ధం అయిపోతున్నట్లు కనిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం అశుతోష్ గోవార్కర్ ఆఫీస్ దగ్గర సారా కనిపించడంపై ఓ స్థాయిలో డిస్కషన్ జరిగిపోతోంది. ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమా కోసం సారాతో చర్చలు నిర్వహిస్తున్నారనే టాక్ వచ్చింది. అయితే.. వాస్తవానికి జరిగింది వేరట. అసలు సంగతి ఏంటంటే.. ఈ దర్శకుడే సారా ఆలీ ఖాన్ కు కబురు పంపినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - సారా ఆలీ ఖాన్ నటిస్తున్న కేదార్ నాథ్ మూవీకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ చేసిన కొన్ని సన్నివేశాలకు సంబంధించిన రషెస్ ను చూశాడట అశుతోష్. వీటిలో సారా నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మెస్మరైజ్ అయిపోయాడని అంటున్నారు.

తను తెరకెక్కించే చిత్రంలో సారాను తప్పకుండా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి.. ఆమెకు కబురు పంపేసి డిస్కషన్స్ చేశాడట. ఇప్పటికే ఈ చిత్రంలో సంజయ్ దత్ ను ప్రధాన పాత్ర కోసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అశుతోష్ మాత్రమే కాకుండా.. పలువురు దర్శక నిర్మాతలు సారా ఆలీ ఖాన్ ను తమ మూవీలో నటింపచేసేందుకు తెగ ట్రై చేసేస్తున్నారు.