Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్యాన్స్‌ మద్దతు కోసం అషు రెడ్డి ప్రయత్నం!

By:  Tupaki Desk   |   1 Aug 2019 1:30 AM GMT
పవన్‌ ఫ్యాన్స్‌ మద్దతు కోసం అషు రెడ్డి ప్రయత్నం!
X
సోషల్‌ మీడియ ద్వారా జూనియర్‌ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉంది. అప్పట్లో అచ్చు సమంత మాదిరిగా ఉంది అంటూ ఏ జనాలతో అయితే ప్రశంసలు దక్కించుకుందో ఇప్పుడు అదే జనాలు మరీ ఇలా అయ్యిందేంటి అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న క్రేజ్‌ అషు రెడ్డికి ఇప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె గతంలో మాదిరిగా సమంత మాదిరిగా లేకుండా బాగా బొద్దుగా అయ్యింది. అందుకే జనాల ఓట్లు దక్కించుకునేందుకు ఆమె టీం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అషు రెడ్డి ప్రమోషన్‌ చూస్తున్న వారు తాజాగా ఆమె చేసిన ఒకప్పటి ట్వీట్‌ ను వైరల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అషు రెడ్డి తన చెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ పేరును టాటూ వేయించుకుంది. 2018 లో ట్విట్టర్‌ లో తాను పవన్‌ పేరును టాటూ వేయించుకున్నాను. ఇప్పుడు నాకు ఆయనతో రిలేషన్‌ ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించింది. ఆ సమయంలో అషు రెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ తో దిగిన ఫొటోను కూడా ఆమె సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

ఇప్పుడు పవన్‌ పై ఆమెకు ఉన్న అభిమానంను బిగ్‌ బాస్‌ లో ఓట్ల మాదిరిగా మార్చుకునేందుకు ఆమె టీం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పటి పోస్ట్‌ లను ఇప్పుడు బయటకు తీసుకు వస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని అని అందుకే పవన్‌ ఫ్యాన్స్‌ అంతా కూడా అషు రెడ్డిని సపోర్ట్‌ చేయాలన్నట్లుగా డైరెక్ట్‌ గా కాకుండా ఇండైరెక్ట్‌ గా పవన్‌ ఫ్యాన్స్‌ నుండి ఎమోషనల్‌ గా అషురెడ్డికి ఓట్లు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మొత్తానికి బిగ్‌ బాస్‌ లోకి వెళ్లిన ఎక్కువ శాతం కంటెస్టెంట్స్‌ బయట జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారు. మరి ఈ పాత పోస్ట్‌ లు పవన్‌ ఫ్యాన్స్‌ నుండి అషుకు ఓట్లను తెచ్చి పెడతాయో చూడాలి.