Begin typing your search above and press return to search.

వీడియో : మళ్లీ ఇన్నాళ్లకు జూ. సమంత పేరుకు సార్థకం

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:00 AM GMT
వీడియో : మళ్లీ ఇన్నాళ్లకు జూ. సమంత పేరుకు సార్థకం
X
టిక్‌ టాక్ రాకముందు డబ్‌ స్మాష్‌ వీడియో లు వైరల్ అవుతూ ఉండేవి. చాలా మంది ప్రముఖులు కూడా డబ్‌ స్మాష్ వీడియోలు చేయడం జరిగింది. పలువురు స్టార్స్ కు చెందిన ఫేమస్ డైలాగ్స్ ను చెబుతూ ఉండే వారు. అలా సమంత డైలాగ్స్ ను ఎక్కువగా చెప్పడంతో పాటు అప్పట్లో చూడ్డానికి సమంతలా ఉండటంతో అషూ రెడ్డి బాగా పాపులర్ అయ్యింది. సమంత ను చాలా మంది జూనియర్ సమంత అంటూ ప్రశంసలు కురిపించిన సందర్బాలు ఉన్నాయి. కాలం గడుస్తున్నా కొద్ది అషు రెడ్డి కాస్త బరువు పెరగడంతో పాటు సమంత పోలికలు పోయినట్లుగా అనిపించింది. దాంతో సమంత అభిమానులు అషు రెడ్డిని లైట్‌ తీసుకోవడం మొదలు పెట్టారు.

బిగ్‌ బాస్ లో అవకాశం దక్కడంతో అషు మళ్లీ సందడి చేయడం మొదలు పెట్టింది. బిగ్‌ బాస్ లో ఈమె ఉన్నది కొన్నాళ్లే అయినా కూడా మళ్లీ జనాల్లోకి వెళ్లేందుకు ఈమెకు మంచి అవకాశం దక్కింది. యూట్యూబ్‌ మరియు టీవీ షో లతో బిజీగా ఉన్న అషు రెడ్డి మరోసారి జూనియర్‌ సమంత అనిపించుకుంది. పుష్ప సినిమా లో సమంత చేసిన ఐటెం సాంగ్‌ ఊ అంటావా మావ ఊఊ అంటావా మామ కు కవర్ సాంగ్‌ చేసింది. అచ్చు సమంత తరహాలో డ్రస్సింగ్‌ చేసుకుని ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్స్ మూమెంట్స్ తో అషు రెడ్డి కిక్కిచ్చింది. వావ్ అషు అంటూ అంతా కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం సమంత చేసిన ఊ అంటావా మామ తో పాటు అషు చేసిన ఈ కవర్‌ సాంగ్‌ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జూనియర్‌ సమంత అని అప్పుడు పేరు పెట్టినందుకు మళ్లీ ఇప్పుడు ఆ పేరుకు సార్థకత తీసుకు వచ్చిన అషు రెడ్డికి అభినందనలు అంటూ సమంత అభిమానులు సోషల్‌ మీడియాలో మరియు యూట్యూబ్‌ లో ఈ పాట కు కామెంట్స్ గా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్‌ మా లో ఎప్పుడు ఏదో ఒక షో తో కనిపిస్తూ ఉన్నా అషు రెడ్డి సినిమా ల్లో కూడా బిజీ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి సమంత ను మరోసారి ఇమిటేట్‌ చేయడం ద్వారా అషు రెడ్డికి మరింత పాపులారిటీ దక్కింది.