Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాలీవుడ్‌ హీరోయిన్ కాదు మన బిబి బ్యూటీనే

By:  Tupaki Desk   |   1 Aug 2022 9:30 AM GMT
పిక్ టాక్ : బాలీవుడ్‌ హీరోయిన్ కాదు మన బిబి బ్యూటీనే
X
తెలుగు ముద్దుగుమ్మలు స్కిన్‌ షో చేసేందుకు ఆసక్తి చూపించరు.. ఒక వేళ తెలుగమ్మాయిలు స్కిన్‌ షో చేసినా కూడా జనాలు ఒప్పుకోరు అనే టాక్ ఒకప్పుడు ఉండేది. కాని ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారినట్లుగానే ఉంది.

బాలీవుడ్‌ హీరోయిన్స్.. ఆ మాటకు వస్తే హాలీవుడ్‌ హీరోయిన్స్ కూడా మా ముందు దిగదుడుపే అన్నట్లుగా తెలుగు సెలబ్రెటీ అమ్మాయిల ఇన్‌ స్టా ఫోటోలు ఉంటున్నాయి.

సౌత్‌ ముద్దుగుమ్మల్లో తెలుగు అమ్మాయిలు అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నట్లుగా తెలుగు ముద్దుగుమ్మల ఫోటో షూట్స్ ఉంటున్నాయి. హీరోయిన్స్ గా తెలుగు ముద్దుగుమ్మలు సక్సెస్ అవ్వలేక పోతున్నారు కాని సోషల్‌ మీడియాలో మాత్రం అందంతో ఆకట్టుకోవడంలో బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తున్నారు.

స్కిన్ షో చేసే తెలుగు సెలబ్రిటీ ల్లో అషు రెడ్డి ముందు వరుసలో ఉంటుంది. జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకుని.. బిగ్‌ బాస్ లో పవన్‌ అభిమానిగా ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు బిగ్‌ బాస్ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్‌ లో ఫోటోలు షేర్‌ చేసి వర్ష కాలంలో కూడా మంటలు పుట్టిస్తోంది.

తాజాగా అషు షేర్‌ చేసిన ఈ ఫోటోలను అందరు కూడా నోరు వెళ్లబెట్టి మరీ చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. బ్లాక్ బికినీ లో ఈ అమ్మడు పూల్‌ లో అందాల ఆరబోత చేస్తూ ఇచ్చిన ఫోజ్‌ లకు ఎంతటి వారి గుండె అయినా గల్లంతు అవ్వాల్సిందే.

హీరోయిన్‌ గా నటించే ముద్దుగుమ్మలు కూడా ఈ స్థాయి లో స్కిన్‌ షో చేసినా ఇంత అందంగా ఉండరు అనేది అషు అభిమానుల కామెంట్‌.