Begin typing your search above and press return to search.

పవన్ పై మ‌ళ్లీ అషు కామెంట్.. వీడియో రిలీజ్‌.. నా పేరు నాశ‌నం చేస్తున్నార‌ని ఫైర్‌!

By:  Tupaki Desk   |   7 March 2021 9:39 AM GMT
పవన్ పై మ‌ళ్లీ అషు కామెంట్.. వీడియో రిలీజ్‌.. నా పేరు నాశ‌నం చేస్తున్నార‌ని ఫైర్‌!
X
సోష‌ల్ మీడియా ద్వారా ఫేమ‌స్ అయ్యి, సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అషు రెడ్డి. హీరో నితిన్ తో ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మించిన ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలో నటించిందీ అమ్మడు. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది. అయితే.. ఆ తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు. దాదాపు రెండేళ్లుగా సైలెంట్ గానే ఉండిపోయింది. తాజాగా.. మరోసారి పవర్ స్టార్ ను కలిసిందీ బ్యూటీ.

అప్పట్లో డబ్ స్మాష్ వీడియోలతో హల్ చల్ చేసిన అషు.. ప్రధానంగా సమంత వీడియోలు చేస్తూ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. అలా జూనియర్ సమంత అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టమని ఈ బ్యూటీ చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఆ అభిమానం స్థాయి ఎలాంటిదంటే.. ఏకంగా హృద‌యంపైనే ప‌వ‌న్ పేరును టాటూ వేసుకుంది.

ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాతే ప‌వ‌న్ ను మొద‌టి స‌రి క‌లిసింది అషు. అయితే.. చాలా గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌ల‌ మ‌రోసారి ప‌వ‌న్ ను క‌లిసిందీ భామ‌. ఆ ఫొటోను షేర్ చేస్తే.. ‘నా దేవుడిని మళ్లీ కలిశాను. నాకు చాలా గర్వంగా ఉంది. మీరే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ గారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే.. ఈ పోస్టులో ఓ నెటిజన్ ‘మీకు ఛాన్స్ వస్తే.. పవన్ నాలుగో భార్యగా ఉంటారా?’ అని అడగ్గా.. అవును అని చెప్పింది అషు. దీంతో.. ఈ విషయం పెద్ద న్యూస్ అయ్యింది. ఈ వార్త‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ లేటెస్ట్ గా ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘పవన్ నాకు దేవుడితో సమానం అని చాలా సార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. మీ రాతల వల్ల పవన్ గారు అమ్మాయిలను కలవాలా వ‌ద్దా అనుకుంటారు. మీ వ‌ల్ల నా పేరు నాశ‌నం అవుతోంది. ఎవ‌రినీ బ‌ద్నాం చేయ‌కండి’ అని రాసుకొచ్చింది అషు.