Begin typing your search above and press return to search.

పిల్ల‌ను వెత‌కాలా.. ప‌డేసే టిప్స్ చెప్పాలా విశ్వ‌క్‌?

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:39 PM GMT
పిల్ల‌ను వెత‌కాలా.. ప‌డేసే టిప్స్ చెప్పాలా విశ్వ‌క్‌?
X
విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత నైజాంలో ట్యాలెంట్ తో దూసుకొచ్చిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. ఫ‌ల‌క్ నుమా దాస్ గా హైద‌రాబాదీ యాస తో యాంగ్రీ యంగ్ మేన్ గా అద‌ర‌గొట్టాడు. ఆ త‌ర్వాత పాగ‌ల్ .. హిట్ చిత్రాల‌తోనూ మెప్పించాడు. హీరోగా భ‌విష్య‌త్ ఉన్న ప్ర‌తిభావంతుడిగా అత‌డు రికార్డుల‌కెక్కాడు.

ఇప్పుడు విశ్వ‌క్ సేన్ మ‌రో క్రేజీ మూవీతో తెలుగు ఆడియెన్ ముందుకు వ‌స్తున్నారు. ఈ మూవీ టైటిల్ -అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్ చిన్న దర్శకుడు. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరొక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి.. లేదా కనీసం పడేయటానికి టిప్స్ అయినా ఇవ్వండి`` అంటూ కోరాడు. బ‌యోడేటాతో రెక్వ‌స్ట్ కి దిగాడు విశ్వ‌క్. `హెల్ప్ అల్లం.. ఫైండ్ పెళ్ళాం` హ్యాష్ ట్యాగ్ ఆక‌ట్టుకుంటోంది. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎస్.వి.సి.సి డిజిటల్ బ్యానర్ పై ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

సినిమా సినిమాకి న‌టుడిగా నిరూపించుకుంటూ దూసుకెళుతున్న విశ్వ‌క్ మ‌రో హిట్ అందుకుంటాడ‌నే ధీమాను టీమ్ వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ తో బిజీగా అవుతున్నారు.