Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుడికి ఆ బ్యూటీ ఫిక్స్!

By:  Tupaki Desk   |   14 Oct 2018 10:26 AM GMT
మహేష్ మేనల్లుడికి ఆ బ్యూటీ ఫిక్స్!
X
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా త్వరలో టాలీవుడ్ లో హీరో గా రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోగా లాంచ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అశోక్ కు జోడీగా నభా నటేష్ ను ఎంపిక చేశారట.

రీసెంట్ గా రిలీజ్ అయిన సుధీర్ బాబు చిత్రం 'నన్ను దోచుకుందువటే' సినిమా తో నభా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా లాభాలు తీసుకురాలేదు గానీ డైరెక్టర్ RS నాయుడు.. హీరోయిన్ నభా నటేష్ లకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాతే దిల్ రాజు నభాను తమ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారట. సుధీర్ బాబు సినిమా 'ఆడు మగాడ్రా బుజ్జి' దర్శకుడు కృష్ణారెడ్డి అశోక్ గల్లా చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

ఇదిలా ఉంటే 'నన్ను దోచుకుందువటే' తర్వాత కన్నడ బ్యూటీ నభా కు ఫుల్లుగా ఆఫర్లు వస్తున్నాయి. అశోక్ గల్లా డెబ్యూ ఫిలిం తో పాటుగా రవితేజ -విఐ ఆనంద్ కాంబినేషన్ లోతెరకేక్కుతున్న 'డిస్కో రాజా' సినిమాలో కూడా హీరోయిన్ ఆఫర్ వచ్చిందట.