Begin typing your search above and press return to search.

మ‌హేశ్ కుటుంబం నుంచి మ‌రో అంద‌మైన హీరో

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:30 PM GMT
మ‌హేశ్ కుటుంబం నుంచి మ‌రో అంద‌మైన హీరో
X
అంద‌మైన వ‌ర్చ‌స్సు - ఆక‌ట్టుకునే క‌ళ్లు - స్పూర‌ద్రూపంతో మ‌రో హీరో తెర‌మీద‌కు వ‌చ్చేస్తున్నాడు. ప్రిన్స్‌ మ‌హేశ్ కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ అంద‌గాడు టీడీపీ గుంటూరు ఎంపీ-ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయ‌దేవ్ పెద్ద కుమారుడు. ఈ సోగ్గాడి పేరు అశోక్ గ‌ల్లా. ఈ కుర్ర హీరో ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే... ఆయ‌నకు పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. గ‌ల్లా యువ సైన్యం పేరుతో ఈ అభిమానుల బృందం ఏర్ప‌డింది. ఈ అభిమాన బృందమే త్వ‌ర‌లో త‌మ అంద‌గాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని ప్ర‌క‌టించింది.

అశోక్ గ‌త కొద్దికాలంగా సినిమాల్లో న‌టించేందుకు చాలా ఆస‌క్తితో ఉన్నారు. ఆయ‌న న‌ట‌న కౌశ‌లం గురించి కొద్దికాలం క్రితం మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అంతేకాకుండా సినిమాల్లో న‌టించేందుకు త‌గిన శిక్ష‌ణ‌ను సైతం అశోక్ పొందాడు. కాగా త్వ‌ర‌లోనే త‌మ బ్యాన‌ర్‌లో కుమారుడితో సినిమా రానుంద‌ని అశోక్ తండ్రి గ‌ల్లా జ‌య‌దేవ్ తెలుప‌డ ఆస‌క్తిక‌రం. అశోక్ ఎంట్రీతో సూప‌ర్ స్టార్ కృష్ణ‌ - ప్రిన్స్ మ‌హేశ్ బాబుల వార‌సుడిగా మ‌రో న‌టుడు రానున్న‌ట్లుగా తేలింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/