Begin typing your search above and press return to search.
గ్రాండ్ గా అశోక్ గల్లా రెండో సినిమా ప్రారంభం..
By: Tupaki Desk | 5 Feb 2023 5:03 PM GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొత్తగా పరిచయమైన హీరోల్లో అశోక్ గల్లా ఒకరు. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడిగా ఓ వైపు పొలిటికల్ సపోర్ట్.. మరోవైపు ఘట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్.. అలా ఈ రెండు ఆసరాగా చేసుకుని బాక్సాఫీస్ వద్ద 'హీరో' చిత్రంతో గతేడాది తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను అందుకున్న ఈ హీరో మళ్ళీ ఏడాది తర్వాత తన రెండో సినిమాను ప్రకటించాడు.
అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తోన్న ఈ కొత్త నిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు.. ఆ!, జాంబీరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అలా తొలి సినిమాకు భిన్నంగా మైథలాజికల్ టచ్‌తో అశోక్ గల్లా తన రెండో సినిమాను చేయబోతున్నాడు.
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్‌తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరయ్యారు. నమ్రత ఘట్టమనేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. తొలి షాట్ బోయపాటి శ్రీను తీశారు. విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టారు. లలి తాంబిక ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
కాగా, దర్శకుడిగా అర్జున్ జంధ్యాలకు ఇది రెండో సినిమా. గతంలో కార్తికేయ గుమ్మకొండతో గుణ 369 అనే సినిమా చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.