Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మేనల్లుడు.. సినిమా ఫిక్స్

By:  Tupaki Desk   |   3 Nov 2019 11:47 AM GMT
సూపర్ స్టార్ మేనల్లుడు.. సినిమా ఫిక్స్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ డెబ్యూ సినిమాకు గతంలో ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ సినిమా ఆగిపోయింది. దిల్ రాజు నిర్మాణంలో 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కాల్సింది కానీ ఆ సినిమా ఆగిపోవడంతో తర్వాత అశోక్ డెబ్యూ గురించి వార్తలేమీ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం అశోక్ గల్లా కు కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందట. 'భలే మంచి రోజు'.. 'శమంతకమణి'.. 'దేవదాస్' సినిమాలను రూపొందించిన శ్రీరామ్ ఆదిత్య ఈ డెబ్యూ హీరో సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారట. ఈ సినిమాను నవంబర్ 10 వ తారీఖున లాంచ్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులకు కొదవేమీ లేదు. ఈ జెనరేషన్లో మహేష్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మరోవైపు మహేష్ బావ సుధీర్ బాబు కూడా హీరోగా తన సత్తా చాటుతున్నారు. మరి ఇదే బాటలో మహేష్ మేనల్లుడు అశోక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.