Begin typing your search above and press return to search.

సీరియళ్లు సినిమాను మించిపోయేలా ఉన్నాయే?

By:  Tupaki Desk   |   12 May 2018 1:55 PM GMT
సీరియళ్లు సినిమాను మించిపోయేలా ఉన్నాయే?
X
ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో టీవీ సీరియళ్లు సినిమాతో ఎప్పటి నుంచో పోటీపడుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా ఇష్టపడే ఫ్యామిలీ డ్రామా - సెంటిమెంట్ కథలన్నింటినీ టీవీ సీరియళ్లు కబ్జా చేసేశాయి. ఇలాంటి కథాంశాలతో సినిమాలు దాదాపుగా తీయడం మానేశారు. ఇప్పుడు టీవీలు ఇంకో అడుగు ముందుకేసి యూత్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి.

సినిమాల్లో యూత్ ను ఆకట్టుకోవడం కోసం లిప్ లాక్ సీన్లు ఎప్పుడో మొదలెట్టేశారు. మొదట్లో సినిమాకు ఒక లిప్ లాక్ ఉంటే గొప్ప. ఇప్పుడు సినిమా మొత్తం ముద్దుల్లో ముంచేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని టీవీలు ఈ విషయంలో ముందుడుగు వేయలేదు. ఈ హద్దులను దాటేస్తే పాపులర్ టీవీ హీరోయిన్ సోనారిక భడోరియా టీవీ సీరియల్ లోనూ లిప్ లాక్ ఇచ్చేసింది. భక్తి సీరియల్ లో పార్వతీదేవి పాత్రతో ఫేమస్ అయిన సోనారికా ఒకట్రెండు సినిమాలు కూడా చేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ తో స్పీడున్నోడు.. మంచు విష్ణుతో ఆడోరకం.. ఈడోరకం సినిమాల్లో సోనారికా హీరోయిన్ గా చేసింది. ఆడోరకం.. ఈడోరకంలో స్విమ్ సూట్ తో అందాలు ఆరబోసింది. తరవాత పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో మళ్లీ హిందీ సీరియళ్లపై దృష్టిపెట్టింది. ఇప్పుడిప్పుడే సీరియళ్లలో రొమాన్స్ డోస్ పెరుగుతోందనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు సోనారిక ఏకంగా లిప్ లాక్ పెట్టేసింది. ఇంక ముందుముందు ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో?