Begin typing your search above and press return to search.

వ‌కీల్ రాక‌ ముందే కుటుంబ హీరోని దించాలా?

By:  Tupaki Desk   |   7 April 2021 7:30 AM GMT
వ‌కీల్ రాక‌ ముందే కుటుంబ హీరోని దించాలా?
X
ఇండ‌స్ట్రీలో హీరోల కుమారులు హీరోలు అవ్వ‌డం రెగ్యుల‌ర్. నిర్మాత‌ల వార‌సులు హీరోలుగా వ‌స్తున్నా ఎవ‌రూ నిల‌బ‌డ‌డం లేదు. బెల్లంకొండ వార‌సుడు శ్రీ‌ను మిన‌హా ఇత‌ర పేర్లేవీ వినిపించ‌డం లేదు. అయినా ఇక్క‌డ ప్ర‌య‌త్నాలు ఏవీ ఆగ‌డం లేదు. ఇక దిల్ రాజు కుటుంబం నుంచి ఒక హీరో వ‌స్తున్నాడు అంటూ చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. కానీ ఇంత‌కాలం అత‌డు ఎలా ఉంటాడు? అన్న‌ది తెలుగు ఆడియెన్ కి స‌స్పెన్స్.

అయితే ఎట్ట‌కేల‌కు దిల్ రాజు త‌న కుటుంబ హీరోని ప‌రిచ‌యం చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 9న వ‌కీల్ సాబ్ రిలీజ‌వుతుంటే.. ఒక‌రోజు ముందు రాజుగారి మేనల్లుడు ఆశిష్ తొలి చిత్రం ఇంట్రడక్షన్ వీడియోని విడుద‌ల చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనేది టైటిల్. `హుషారు` ఫేమ్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. క్యూటీ అనుపమ పరమేశ్వరన్ డెబ్యూ హీరో స‌ర‌స‌న న‌టిస్తోంది.

హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కించిన హ‌ర్ష ఈ చిత్రంలో దిల్ రాజు కుటుంబ హీరోని ఎలా చూపించ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. మ‌రో యువ‌త‌రం ప్రేమ‌క‌థా చిత్ర‌మిద‌ని.. వినోదానికి కొద‌వుండ‌ద‌ని ఇన్ సైడ్ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు- శిరీష్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోనే రౌడీ బాయ్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండ‌గా.. మాదీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డెబ్యూ హీరో ల‌క్ ఎలా ఉందో చూడాలి.