Begin typing your search above and press return to search.

రౌడీ బాయ్ తో సుకుమార్ - దిల్ రాజుల 'సెల్ఫిష్'

By:  Tupaki Desk   |   15 Jan 2022 3:30 AM GMT
రౌడీ బాయ్ తో సుకుమార్ - దిల్ రాజుల సెల్ఫిష్
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు సోదరుడి కుమారుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం ''రౌడీ బాయ్స్‌''. ‘హుషారు’ ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్‌ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

'రౌడీ బాయ్స్' సినిమాని సంక్రాంతి సందర్భంగా శుక్రవారం గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆశిష్‌ హీరోగా రెండో ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు - ఆశిష్.. ''సెల్ఫిష్‌'' అనే టైటిల్‌ తో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ 'సెల్ఫిష్‌' చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. 'ఉప్పెన' సినిమాతో తన శిష్యుడు బుచ్చిబాబుని డైరెక్టర్ గా పరిచయం చేసిన సుక్కూ.. ఇప్పుడు మరో శిష్యుడు కాశీ ని దర్శకుడిగా ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లో నటించే ఇతర నటీనటులు మరియు సిబ్బంది వివరాలను వెల్లడించనున్నారు. ఏదేమైనా దిల్ రాజు 'రౌడీ బాయ్స్' సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని పట్టించుకోకుండా.. ముందే తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కోసం మరో ప్రాజెక్ట్ సెట్ చేశారు. మరి అగ్ర నిర్మాత సపోర్ట్ తో ఆశిష్ హీరోగా నిలదొక్కుకుంటారో లేదో చూడాలి.