Begin typing your search above and press return to search.

పెళ్లి సందD' పిల్ల డిమాండ్ పెరిగినట్టే!

By:  Tupaki Desk   |   23 Jan 2022 6:13 AM GMT
పెళ్లి సందD పిల్ల డిమాండ్ పెరిగినట్టే!
X
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి తరువాత స్థానంలో ఎవరున్నారా అని చూస్తే 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీల కనిపిస్తుంది. చక్కని కనుముక్కు తీరుతో ఈ కన్నడ బ్యూటీ కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. బాదుషా లాంటి పిల్లను భలేగా పట్టుకొచ్చారేనని రాఘవేంద్రరావుని మరోసారి మెచ్చేసుకున్నారు. ఆయన టేస్టుపై .. ఎంపికపై ప్రేక్షకులకు మంచి నమ్మకం ఉంది. అందువలన కుర్రాళ్లంతా కొంతకాలం పాటు ఆమె అభిమానులుగా ఉండిపోవాలనీ .. ఆరాధకులుగా రోజులు గడపాలని నిర్ణయించుకున్నారు.

పిల్లగాళ్లంతా తమ పడుచు గుండెలను గుత్తాకి రాసిచ్చేడంతో ఇక ఈ పిల్ల చెలరేగిపోతోంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. 'పెళ్లి సందD' ఆశించిన స్థాయిలో సందడి చేయకపోయినా, ఈ పిల్ల అందాల సందడిలో మాత్రం ప్రేక్షకులు పాలుపంచుకున్నారు. దాంతో వరుస అవకాశాలు వచ్చేసి ఆమె వలలో పడిపోతున్నాయి. ఆమె గ్లామర్ గాలానికి చిక్కిపోతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి .. డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచాలనే సూత్రాన్ని ఇప్పటి హీరోయిన్స్ కి ఎవరూ చెప్పవలసిన పనిలేదు.

అందువలన ఈ కన్నడ గంధం ఇప్పుడు భారీగానే పారితోషికం పెంచేసిందట. 'పెళ్లి సందD' తరువాత ఈ అమ్మాయి రవితేజ సరసన నాయికగా 'ధమాకా' సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. అప్ కమింగ్ హీరో నుంచి ఒక్కసారిగా సీనియర్ స్టార్ హీరో సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ తరువాత సినిమాలకు మాత్రం ఆమె పెంచిన పారితోషికమే చెబుతోందట. సినిమాకి కోటి రూపాయలు అడుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సుందరి ఈ పారితోషికానికి రెండు సినిమాలను ఒప్పుకున్నట్టుగా సమాచారం. సితార బ్యానర్ వారు కొత్తగా రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఒక సినిమాను వైష్ణవ్ తేజ్ తోను .. మరో సినిమాను నవీన్ పోలిశెట్టితోను చేయనున్నారు. ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నారు. పెద్ద బ్యానర్ పై ఒకేసారి రెండు సినిమాలు చేసే ఛాన్స్ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు రానున్నాయి. ఇక త్వరలోనే రామ్ .. నితిన్ .. నాగశౌర్య వంటి యంగ్ హీరోల జోడీగా ఈ పిల్లకి అవకాశాలు రావడం ఖాయమేనని అనిపిస్తోంది.