Begin typing your search above and press return to search.

మూస క‌థ‌లు తీస్తున్నామ‌న‌డం త‌ప్పు

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:30 AM GMT
మూస క‌థ‌లు తీస్తున్నామ‌న‌డం త‌ప్పు
X
మాస్ - యాక్ష‌న్ స్టోరీస్ తెర‌కెక్కించ‌డంలో ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రికి ఓ ప్ర‌త్యేక శైలి ఉంది. అప్ప‌ట్లో అగ్రెస్సివ్ హీరో గోపిచంద్‌ తో య‌జ్ఞం తీసి హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా తెర‌కెక్కి ఇప్ప‌టికి 10 ఏళ్లు పూర్త‌యినా ఈ కాంబినేష‌న్ సినిమా మ‌ళ్లీ రానేలేదు. ఇన్నాళ్టికి ఈ ఇద్ద‌రూ క‌లిశారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఓ ఫ్యామిలీ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌ టైన‌ర్‌ ని తెర‌కెక్కించాడు. ఈ క్రిస్ మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది ఈ చిత్రం. ఈ సంద‌ర్భంగా త‌న సినిమా హైలైట్స్ గురించి ర‌వికుమార్ చౌద‌రి చెబుతూ..

ఇదో కొత్త‌ పాయింట్‌ తో తెర‌కెక్కుతున్న సినిమా అని చెప్ప‌ను కానీ.. . స్ర్రీన్‌ ప్లేలో సంథింగ్ స్పెషాలిటీ ఉంటుంది.. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నాం. గోపీచంద్ సినిమా అంటే యాక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. కాబ‌ట్టి యాక్ష‌న్‌ లోనే ఇంకేదైనా కొత్త గా ఎటెంప్ట్ చేశామ‌ని అంతా ప్ర‌సంసించేలా ఉంటుంది. అంత‌కుమించి గోపిచంద్ కామెడీని అద‌ర‌గొట్టేశాడు. 40 మంది క‌మెడియ‌న్ల మ‌ధ్య ఇంత కామిక్ టైమింగ్‌ తో న‌టించ‌గ‌ల‌డా అని అనిపించింది. కానీ కామెడీ అద‌ర‌గొట్టేశాడు.

11 ఏళ్ల త‌ర్వాత క‌లిసి ప‌నిచేస్తున్నా. అయితే వ్య‌క్తిగ‌తంగా గోపిచంద్ లో పెద్ద‌గా మార్పులు రాలేదు. ప్రొఫెష‌న‌ల్‌ గా ఎంతో ఎదిగాడు. ప్ర‌తిదీ ఒక‌టి రెండు టేక్‌ ల‌లోనే పూర్తి చేసేస్తున్నాడు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ కి పిల్లా నువ్వు లేని జీవితం త‌ర్వాత మ‌రోసారి రెజీన‌తో క‌లిసి ప‌నిచేశాను. త‌ను డ్యాన్సులు ఇర‌గ‌దీసేసింది.. అంటూ చెప్పుకొచ్చారు.

తెలుగు ద‌ర్శ‌కులు మూస క‌థ‌లు సినిమాలుగా తీస్తున్నారు అనడం స‌రికాదు. అది త‌ప్పు. నాలుగైదేళ్ల‌కో ట్రెండ్ మారుతుంటుంది. ఆ ట్రెండ్‌ కి త‌గ్గ‌ట్టే సినిమాలొస్తాయ్‌. మ‌నం రాసుక‌న్న క‌థ‌ల కంటే ప‌క్క‌వాళ్లు చెప్పే క‌థ‌లు ఎక్కువ కిక్కిస్తాయి. అలాంట‌ప్పుడే వేరేవారు రాసిన క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటాం.. శ్రీ‌ధ‌ర్ సీపాన డైలాగులు సౌఖ్యం సినిమాకి పెద్ద ప్ల‌స్ అవుతాయ‌ని ర‌వికుమార్ చౌద‌రి చెప్పారు.