Begin typing your search above and press return to search.

సాయిధరమ్, చౌదరి.. మళ్లీ

By:  Tupaki Desk   |   12 Nov 2015 11:30 AM GMT
సాయిధరమ్, చౌదరి.. మళ్లీ
X
అవును సాయిధరమ్ తేజ్ - చౌదరి మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఐతే ఇక్కడ మాట్లాడుతున్నది వైవీఎస్ చౌదరి గురించి కాదు.. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గురించి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి హిట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సాయి తొలి సినిమాగా విడుదలైన ఈ సినిమా అతడి కెరీర్ కు మంచి ఊపునిచ్చింది. దీని తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చేసిన సాయి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీమ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత రవికుమార్ చౌదరితో సినిమా మొదలుపెట్టబోతున్నాడు సాయిధరమ్. ప్రస్తుతం రవికుమార్ చౌదరి.. గోపీచంద్ తో ‘సౌఖ్యం’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. అది దాదాపు పూర్తి కావస్తోంది. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదే నెలలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో సినిమా చౌదరి సినిమా మొదలవుతుంది. అది వేసవికల్లా పూర్తవుతుంది. అప్పటికి సాయిధరమ్ కూడా ఫ్రీ అవుతాడు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఆరంభమవుతుంది. ఐతే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా ఫిక్సవలేదు.