Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు చూసి ప్రభాస్‌ పొగిడేశాడు

By:  Tupaki Desk   |   9 Sept 2015 1:18 AM IST
శ్రీమంతుడు చూసి ప్రభాస్‌ పొగిడేశాడు
X
ఆర్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - లెజెండ్‌ - బొమ్మరిల్లు .. ఇలా భారీ ప్రాజెక్టులకు కళాదర్శకుడిగా పనిచేశారు ఏ.ఎస్‌.ప్రకాష్‌. టాలీవుడ్‌ లో సుదీర్ఘ అనుభవం ఉన్న కళాదర్శకుడాయన. అయితే కళాదర్శకత్వం అనుకున్నంత వీజీ కాదు. ఠఫ్‌ జాబ్‌ అని చెబుతున్నారు. ఆయనతో ముచ్చట్లివి..

= నా స్వస్థలం వైజాగ్‌. ఫైన్‌ ఆర్ట్స్‌ లో డిగ్రీ పూర్తిచేసి రామోజీ ఫిలింసిటీ లో ఉద్యోగాని కి చేరాను. అక్కడ సీనియర్‌ కళాదర్శకుడు నితీష్‌ రాయ్‌ వద్ద చేరాను. అతడి వద్ద చాలా కాలం పనిచేశా. ఆర్టిస్టు గా స్కెచ్‌ లు వేయడం నా పని. ఆ టైమ్‌ లోనే సుకుమార్‌ నా పనితనం చూసి ఆర్య కి పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా ఆర్య చిత్రంతో కళా దర్శకుడినయ్యా. ఆరంభం ఉద్యోగం రిస్క్‌ చేసి, సొంతంగానే కెరీర్‌ లో నిలబడగలిగాను. ఇప్పటికి 50పైగా సినిమాలకు పనిచేశాను.

=ముందు దర్శకుడు చెప్పిన కథ వింటా. థీమ్‌ అర్థం చేసుకుంటా. దానికి తగ్గట్టే కొన్ని స్కెచ్‌ లు వేస్తాను. వాటిని దర్శకుడికి చూపిస్తా. అవి ఓకే అయితే వెంటనే పని మొదలు పెడతా. సెట్‌ రెడీ అవుతుంది.

=సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి ఇల్లు సెట్‌ వేశాం. ఏదైనా విలేజ్‌ కి వెళ్లి చిత్రీకరించారని అనుకున్నారంతా. ఆ ఇంటి సెట్‌ కి మంచి పేరొచ్చింది. అలాగే మిర్చి, 100 పర్సంట్‌ లవ్‌ సినిమాలకు ఇల్లు సెట్‌ వేశాం. అది అందరినీ మెప్పించాయి. గృహాలంకరణలో లేటెస్ట్‌ ట్రెండ్స్‌ ని పరిశీలించి వాటిని మా డిజైన్‌ లలోకి తెచ్చేస్తాం. అప్‌ టు డేటెడ్‌ గా ఉంటాం.

=సీతమ్మ వాకిట్లో, అల్లుడు శ్రీను సెట్‌ లు చాలా కాస్ట్‌ లీ. వాటికి చాలా గొప్ప పేరొచ్చింది.

=శ్రీమంతుడు చూసి ప్రభాస్‌ గొప్పగా ప్రశంసించారు. ఫలానా సెట్‌, ఫలానా ఫ్రేమ్‌ లో బావుందంటూ చెప్పడం గొప్ప గుర్తింపుగా భావించాను.

=చాలామంది కళా దర్శకులు సినీపరిశ్రమని వదిలేస్తున్నారు. పెళ్లిళ్లకు, లైవ్‌ ఈవెంట్ లకు వెళ్లిపోతున్నారు. సినిమా కళాదర్శకత్వంతో పోల్చుకుంటే అక్కడ ఆదాయం ఎక్కువ. ఒత్తిడి తక్కువ. ఇక్కడ అలా కాదు. ఫ్యామిలీతో గడిపే టైమే ఉండదు.

=అఖిల్‌ సినిమాకి కళాదర్శకుడిగా పనిచేస్తున్నా. స్రవంతి మూవీస్‌ లో రామ్‌ నటించే సినిమాలకు పనిచేస్తున్నా.