Begin typing your search above and press return to search.

గ్యారేజ్ లో హీరో కోసం చాలా కష్టపడ్డాం

By:  Tupaki Desk   |   5 Sept 2016 1:00 PM IST
గ్యారేజ్ లో హీరో కోసం చాలా కష్టపడ్డాం
X
జనతా గ్యారేజ్ మూవీలో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ హైలీ ట్యాలెంటెడ్ యాక్టర్. పెర్ఫామెన్స్ నుంచి డ్యాన్స్ వరకూ తనకు పోటీ రాగల సమకాలికులు లేరనే రేంజ్ లో మెప్పించేయగల ట్యాలెంట్ జూనియర్ ది. మరి అలాంటి యంగ్ టైగర్ కోసం ఎవరో కష్టపడ్డమేంటి.. నాన్సెన్స్ అనిపించడం సహజమే. కానీ జనతా గ్యారేజ్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వెర్షన్ ప్రకారం.. ఈ సినిమాలో మెయిన్ హీరో 'జనతా గ్యారేజ్ సెట్'.

మూవీలో చాలా భాగం గ్యారేజ్ లోపలా బయటానే షూటింగ్ ఉంటుంది. ప్రధానమైన సన్నివేశాలన్నీ గ్యారేజ్ ని బేస్ చేసుకునే ఉంటాయి. పైగా సినిమా పరంగా ఇది చాలా పెద్దగా కూడా ఉండాలి. దీంతో పాటు నేచురల్ లుక్ ఎక్కడా తగ్గకుండా అచ్చు మెకానిక్ షెడ్ లాగానే ఉండాలి. ఇంకా చెప్పాలంటే.. స్టోరీ ప్రకారం సినిమాకి రియల్ హీరో ఈ గ్యారేజ్ సెట్. ఈ పాయింట్స్ అన్నిటినీ శాటిస్ఫై చేసేందుకు.. ఏపీ తెలంగాణల్లో ప్రధానమైన నగరాల్లో ఆటోమొబైల్ గ్యారేజ్ లు అన్నిటికీ తిరిగేసి చివరకు సెట్ వేశారట. అందుకే అంత పర్ఫెక్ట్ గా వచ్చిందని చెబుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్.

పైగా సినిమా థీమ్ ప్రకారం దాదాపు 500 మొక్కలతో పాటు సెట్ లోపల ఓ పెద్ద వృక్షం ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. మొదట ఓ నిజమైన వృక్షం చుట్టూనే సెట్ వేద్దామని అనుకున్నా.. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ట్రీ డిజైన్ చేశారట. ఇక మోహన్ లాల్ ఇంటి సెట్ కూడా సినిమాలో చాలా కీలకమని.. సిటీలో ఉంటున్నా విలేజ్ లుక్ కనిపించేలా జాగ్రత్తపడ్డామని అంటున్నాడు ఏఎస్ ప్రకాష్.