Begin typing your search above and press return to search.

కిచెన్ లో కిల్లింగ్ ఎల్లీ జిల్ జిలేగా

By:  Tupaki Desk   |   21 Jan 2022 5:20 AM GMT
కిచెన్ లో కిల్లింగ్ ఎల్లీ జిల్ జిలేగా
X
కిచెన్ లో చికెన్ వండేస్తోంది.. గుండెల్ని గేభేల్మ‌నిపిస్తోంది. జిల్ జిలేగా అంటూ బ్లాక్ ఇన్న‌ర్ లో జోష్ చూపిస్తోంది. అలా టీ గ్లాస్ తో ఫోజులిస్తూ స‌రాగాలు ప‌లికిస్తోంది. గుండె న‌రాల్ని మీటోస్తోంది ఎల్లీ అందం. యువ‌క్రికెట‌ర్ల‌తో స‌ర‌సాల సాగ‌రంలో మునిగి తేలిన రోజుల‌కు ఇప్ప‌టికీ ఎల్లీ అవ్ రామ్ లో ఏ మార్పూ రాలేదు. ప్రేమ దోమా.. విర‌హం.. కెరీర్ అంటూ అలా అలా బండి న‌డిపించేస్తోంది ఈ విదేశీ ముద్దుగుమ్మ‌.

ఓవ‌రాల్ గా ఐట‌మ్ నంబ‌ర్లు చేస్తూ.. న‌టిగా క్రేజీ స్టార్ల సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటూ .. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎల్లీ చాలానే చేస్తోంది. తాజాగా ఈ భామ ప్ర‌ఖ్యాత‌ ఇన్న‌ర్ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేస్తూ అలా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. కిచెన్ లో చికెన్ వండేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఎల్లీ ఫోజులకు జిల్ల‌నిపోతున్నారు బోయ్స్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇంత‌కుముందు స‌ల్మాన్ భాయ్ బాడీగార్డ్ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంది. ప్ర‌స్తుతం బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో న‌టిస్తోంది. గుడ్ బైలో నీనా గుప్తా కూడా కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ భార్యగా నీనా కనిపించనున్నారు. తప్పడ్ ఫేమ్ పావైల్ గులాటి అతని కొడుకుగా కనిపించనున్నారు. ఎల్లి అవ్రమ్ అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సెట్స్ లో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుని ఇటీవ‌ల ఆనందం వ్య‌క్తం చేశారు.

మెగాస్టార్ తో కలిసి నటించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం బచ్చన్ తన బ్లాగ్ లో రష్మిక మందన్న - పావైల్ గులాటితో పాటు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ -19 యొక్క రెండవ తరంగం సినిమా షూట్‌లను నిలిపివేసిన నెలల తర్వాత జూన్ లో అమితాబ్ బచ్చన్ - రష్మిక మందన్న- ఎల్లీ త‌దిత‌రుల‌పై షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.