Begin typing your search above and press return to search.
మళ్ళీ థియేటర్ల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చిందిగా..!
By: Tupaki Desk | 9 Oct 2021 10:04 PM ISTకరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా థియేటర్లు మూతబడి ఉండటం.. తెరిచినా ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడం ఫిల్మ్ మేకర్స్ ని కలవరపరిచింది. ఇలాంటి సమయంలో చిన్న సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లు దొరికాయి. అందుకే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వారానికి అర డజను చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో జనాలు థియేటర్ల వైపు నడవడం మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన సినిమాల థియేట్రికల్ బిజినెస్ బాగుండటంతో.. ఇప్పుడు వరుసపెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దీంతో మళ్ళీ ఎప్పటిలాగే థియేటర్ల కోసం ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్లూ చిన్న సినిమాలు కాబట్టి ఎలాగోలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఒకేసారి క్రేజీ మూవీస్ వస్తుండటం వల్ల క్లాష్ ఏర్పడి థియేటర్ల కొరత వచ్చింది.
ఇప్పుడు దసరా మొదలుకొని సంక్రాంతి వరకు కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు ఇచ్చేశారు. దసరా సీజన్ కోసం 'మహా సముద్రం' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'వరుడు కావలెను' 'పెళ్లి సందD' వంటి సినిమాలు రెడీ అయ్యాయి. నాలుగు సినిమాలు ఒకే టైం లో వస్తున్నాయంటే అన్నిటికీ ఎక్కువ స్క్రీన్లు దొరకాలంటే కష్టమే. అందులోనూ ఇప్పటికే రిలీజైన 'లవ్ స్టోరీ' 'సీటీమార్' 'రిపబ్లిక్' వంటి సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. ఇప్పుడు 'కొండపొలం' కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో దసరా బరిలో నిలిచే సినిమాలను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. గీతా వారి సినిమా అంటే రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు బ్యాచిలర్ చిత్రాన్ని కూడా అధిక థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బీబ్యానర్ పై 'మహాసముద్రం' సినిమా రూపొందుతోంది. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయాలని చూస్తున్నారు. అక్టోబర్ 14న ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇక రాఘవేంద్రరావు పర్యవేక్షణలో బాహుబలి నిర్మాతలు నిర్మించిన 'పెళ్లి సందD' సినిమాను కూడా బిగ్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఏ సినిమా ఎన్నెన్ని స్క్రీన్లలో విడుదల అవుతుందనే విషయం మీద క్లారిటీ రానుంది.
అయితే దసరా సీజన్ లో మూడు సినిమాలు థియేటర్ల కోసం కొట్టుకుంటున్న నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు 'వరుడు కావలెను' చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మిగతా సినిమాలు ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తుంటే నాగశౌర్య సినిమా సైలెంట్ గా ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీపావళి స్లాట్ కోసం సితార టీమ్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
ఏదేమైనా ఇండస్ట్రీలో ఒకప్పటిలాగే మళ్ళీ థియేటర్ల కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది అర్థం అవుతోంది. అఖిల్ - శర్వానంద్ సినిమాలకే ఇలా ఉంటే.. సంక్రాంతి సీజన్ లో రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' - ప్రభాస్ 'రాధే శ్యామ్' - పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు విడుదల అవుతున్నాయి. మరి అప్పుడు ఈ థియేటర్ల గోల ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.