Begin typing your search above and press return to search.

గోవా ఫిలింఫెస్టివ‌ల్ కి స‌మంత గెస్ట్ గా!

By:  Tupaki Desk   |   8 Nov 2021 11:30 AM GMT
గోవా ఫిలింఫెస్టివ‌ల్ కి స‌మంత గెస్ట్ గా!
X
స‌మంత స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా సామ్ కెరీర్ హ్యాపీగా సాగిపోతుంది. టాలీవుడ్ దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. కోలీవుడ్ లోనూ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది. ఇక టార్గెట్ బాలీవుడ్ మాత్ర‌మే. ఇప్పుడు అక్క‌డ త‌న స‌త్తా చాటాలాని చూస్తోంది. `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ తో పాన్ ఇండియాలో స‌మంత పాపుల‌ర్ అయింది. ఆ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు తెచ్చిపెడుతోంది. ప్ర‌స్తుతం తాప్సీ సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఓ సినిమాకి క‌మిట్ అయింది. మ‌రో రెండు పెద్ద ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇలా సామ్ బాలీవుడ్ కెరీర్ కి పునాది ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా స‌మంత‌కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. 52వ ఇంట‌ర‌నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్ న‌వంబ‌ర్ 20 నుంచి వారం రోజ‌లు పాటు గోవాలో జ‌ర‌గుతున్నాయి. ఈ వేడుల‌కు స‌మంత‌ని నిర్వాహ‌కులు ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. గౌర‌వ ప్ర‌ధ‌మైన హోదా లో సామ్ కి ఈ ఆహ్వానం అందింది. ఆ ర‌కంగా సౌత్ నుంచి ఇలాంటి ఫిలిం ఫెస్టివ‌ల్స్ కి హాజ‌ర‌య్యే న‌టి స‌మంత కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ ఫిలిం పెస్ట్ వ‌ల్ నిర్వాహ‌కులు ఏ సెల‌బ్రిటీని ఇలాంటి హోదాలా ఆహ్వానించ‌లేదు. తొలిసారి ఆ ఛాన్స్ స‌మంత‌కు మాత్ర‌మే ద‌క్కింది. స‌మంత‌తో పాటు మ‌నోజ్ బాజ్ పాయ్ కూడా అంటెండ్ అవుతున్నారు.

ఇంకా ద‌ర్శ‌కులు అరుణ్ రాజే ..వివేక్ అగ్ని హోత్రి ..న‌టుడు జాన్ ఎడ‌త‌తిల్ త‌దిత‌రులు ప్రారంభోత్స‌వం రోజున హాజ‌ర‌వుతున్నారు. స‌మంత కి ఈ ఆహ్వానం అందడం వెనుక మ‌రో కార‌ణం కూడా వినిపిస్తోంది. సామాజిక కార్య‌క్ర‌మాల్లో సామ్ చురుకుగా పాల్గొంటారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లు స్థాపించి ఎన్నో ర‌కాల సేవ‌లు చేస్తున్నారు. ఆమె న‌టి అయిన ద‌గ్గ‌ర నుంచి ఇలాంటి కార్య‌క్ర‌మాల ప‌ట్ల ఎంతో దాతృహృద‌యంతో స్పందిస్తారు. ఆ కార‌ణంగాను సామ్ నిర్వాహ‌కుల దృష్టిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది