Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్ గా రోజుకు 2ల‌క్ష‌లు అందుకున్నా కానీ!

By:  Tupaki Desk   |   7 Jun 2021 5:00 AM IST
క‌మెడియ‌న్ గా రోజుకు 2ల‌క్ష‌లు అందుకున్నా కానీ!
X
స్టార్ క‌మెడియ‌న్ ట‌ర్న్ డ్ హీరోల‌ స‌న్నివేశం తెలిసిన‌దే. ఆరంభం హిట్లు కొట్టినా త‌ర్వాత‌ కొన్ని వ‌రుస ఫ్లాపులు ఎదురైతే స‌న్నివేశం పూర్తిగా క్రిటిక‌ల్ గా మారిపోతుంది. అటుపై తిరిగి క‌మెడియ‌న్ గా ప్ర‌య‌త్నించినా ఆశించిన రిజ‌ల్ట్ క‌నిపించ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే తిరిగి హీరోగా ఏదో ఒక‌ర‌కంగా ల‌క్ కోసం వెతకాల్సిన ప‌రిస్థితి. ఇలానే ఎందుకు? అని ఓ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ట‌ర్న్ డ్ హీరోని అడిగితే.. క‌మెడియ‌న్ గా రాణించాక హీరో లైఫ్ అంతా బోన‌స్.. దానిని ఎంజాయ్ చేసేందుకే సుమీ! అనేసారు. పెండింగ్ లైఫ్ కెరీర్ అంతా జ‌స్ట్ బోన‌స్ అని లైట్ తీస్కున్నార‌ట‌.

ఇండ‌స్ట్రీలో స్టార్ క‌మెడియ‌న్ గా రోజుకు 1-2ల‌క్షలు పారితోషికం తీసుకునే రేంజ్ కి ఎదిగిన స‌ప్త‌గిరి ఆ త‌రువాత హీరోగా మారి ఆరంభం పేరు తెచ్చుకున్నా.. ఆ త‌ర్వాత మాత్రం య‌థావిధిగా ఫ్లాపుల‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ కామెడీ రోల్స్ తో అల‌రించాల‌ని ట్రై చేస్తున్నా అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ్వడం లేదు.

మంచి పాత్ర‌లు ద‌క్కితే స‌ప్త‌గిరి తిరిగి ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేస్తాడు. అత‌డిలోని కామెడీ టైమింగ్ కి ఎవ‌రూ పేరు పెట్ట‌లేరు. ప్ర‌తిభ‌లో స‌ప్త‌గిరి మేటి. అలాగే దాన గుణంతోనూ ప్ర‌జ‌ల్లో ఇమేజ్ తెచ్చుకున్న అరుదైన ప‌ర్స‌నాలిటీ. క‌రోనా క‌ష్ట కాలంలో త‌న స్నేహితుల‌కు ఎంతో సాయం చేశారు స‌ప్త‌గిరి. అత‌డి కంబ్యాక్ అద్భుతంగా ఉండాల‌నే ఆకాంక్షిద్దాం. ప్ర‌తిరోజూ టాలీవుడ్ లో గేమ్ మారుతూనే ఉంటుంది. స‌ప్త‌గిరి గేమ్ ఛేంజ‌ర్ అవుతాడేమో చూడాలి.