Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : తమ్ముడు చెల్లితో అరుదైన ఫోటోను షేర్‌ చేశాడు

By:  Tupaki Desk   |   23 Aug 2022 5:12 AM GMT
పిక్ టాక్ : తమ్ముడు చెల్లితో అరుదైన ఫోటోను షేర్‌ చేశాడు
X
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆ మధ్య డ్రగ్స్ కేసులో జైలు జీవితం ను కూడా గడిపిన విషయం తెల్సిందే. ఆ కేసు లో చిక్కుకోకుంటే ఇప్పటి వరకు ఆర్యన్ ఖాన్‌ హీరోగా మొదటి సినిమా పట్టాలెక్కేది.

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే బాలీవుడ్‌ లో ఆర్యన్ ఖాన్ ఎంట్రీ జరిగిపోయింది. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఆర్యన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఆలస్యం అవుతోంది.

ఆర్యన్‌ ఖాన్ హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అంటూ షారుఖ్‌ ఖాన్‌ అభిమానులతో పాటు బాలీవుడ్‌ వర్గాల వారు కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆర్యన్ ఖాన్‌ రెగ్యులర్ గా ఏదో ఒక ఆసక్తికర పోస్ట్‌ ను పెట్టడం.. అది వైరల్‌ అవ్వడం జరుగుతూనే ఉంది.

హీరోగా ఎంట్రీ ఇవ్వకుండానే రెండు మిలియన్ ల ఇన్‌ స్టా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఆర్యన్ ఖాన్‌ తాజాగా అరుదైన ఫోటోను షేర్ చేశాడు.

ఈ కాబోయే హీరో తన చెల్లి సుహాన ఖాన్ మరియు తమ్ముడ అబ్‌ రామ్ ఖాన్ ల తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఫోటోలో తమ్ముడు మరియు చెల్లిని ఆర్యన్ ఖాన్‌ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఆర్యన్ ఖాన్‌ కూడా చాలా హ్యాండ్సమ్‌ గా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హీరోగా ఆర్యన్ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడంటూ ఈ ఫోటోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటో కి ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. షారుఖ్‌ ఖాన్‌ కూడా ఈ ఫోటోకు ఇన్ స్టా లో కామెంట్‌ పెట్టాడు. ఇంత అందమైన ఫోటో నా వద్ద ఎందుకు లేదు. వెంటనే ఈ ఫోటో నాకు కావాలి అన్నట్లుగా కామెంట్‌ పెట్టాడు. లక్షల మంది ఈ ఫోటో ను కొన్ని గంటల వ్యవధిలోనే లైక్‌ చేశారు.. లక్షల మంది కామెంట్స్ చేశారు.. చేస్తున్నారు. మీరు ఈ అరుదైన ఫోటో ను ఒక లుక్కేయండి.