Begin typing your search above and press return to search.

బాప్ బాద్ షా.. బేటా హాట్ షో

By:  Tupaki Desk   |   12 Jan 2016 1:30 PM GMT
బాప్ బాద్ షా.. బేటా హాట్ షో
X
తండ్రి వారసత్వాన్ని కొడుకులు కంటిన్యూ చేయడం కామనే. మంచి, చెడు రెడు విషయాలనూ ఫాలో అయిపోతుంటారు వారసులు. ఇప్పుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా.. తండ్రిని గుర్తు చేసేస్తున్నాడు. చాలా విషయాల్లో తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించేసుకుంటున్నాడు.

అమ్మాయిల గుండెల్లో బాలీవుడ్ బాద్ షా స్థానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందగాడు, అంతకు మించిన హాట్ బాడీతో ఇప్పటికీ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంటాడు. లుక్స్ తోనే కట్టడి చేసేయడం షారూక్ స్టైల్. ఇప్పుడు ఆర్యన్ కూడా ఇలానే ఉంటున్నాడు. ఇప్పిటికే ఈ కుర్రాడి చేష్టలకు సంబంధించిన చాలా ఫోటోలు ఆన్ లైన్ లో సందడి చేశాయి. అయితే రీసెంట్ గా బయటకు వచ్చిన ఫోటోలు మాత్రం.., కుర్రాడి క్రేజ్ ని అద్దం పడుతున్నాయి. జిప్ లాగేసిన షర్ట్ వేసుకుని.. చుట్టూతా అమ్మాయిలతో ఆర్యన్ ఇచ్చిన పోజ్ అదుర్స్. ఇంతకీ ఈ ఫోటో తీయించుకున్నది తన కాలేజ్ లోనే చదువుతున్న అమ్మాయిలతోనట.

ప్రస్తుతం లండన్ స్కూల్ లో హైయర్ స్టడీస్ చేస్తున్నాడు షారూక్ కొడుకు. ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఆర్యన్ సినీ అరంగేట్రం గురించి అంచనాలు మొదలైపోయాయి. ఆర్యన్ ను లాంఛ్ చేసేందుకు తన కంటే ఎక్కువ అర్హతలు ఎవరికీ లేవంటూ.. రీసెంట్ గా మూవీ మేకర్ కరణ్ జోహార్ తేల్చేశాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మాత్రం అప్పుడే చెప్పలేననడం విశేషం.