Begin typing your search above and press return to search.

'ప‌ఠాన్' సెట్లో చాక్లెట్ బోయ్ లా దిగిన కింగ్ ఖాన్ వార‌సుడు

By:  Tupaki Desk   |   5 March 2021 11:30 AM GMT
ప‌ఠాన్ సెట్లో చాక్లెట్ బోయ్ లా దిగిన కింగ్ ఖాన్ వార‌సుడు
X
బాలీవుడ్ లో కింగ్ ఖాన్ న‌ట‌వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ తెరంగేట్రం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏ క్ష‌ణ‌మైనా అత‌డి ఆరంగేట్రాన్ని షారూక్ ప్ర‌క‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని అంచనా వేస్తున్నారు. అయితే ఖాన్ లెగ‌సీని ముందుకు న‌డిపించేందుకు ఆర్య‌న్ రాక‌కు ముందే షారూక్ కుమార్తె సుహానా ఖాన్ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతుంది. సుహానా రంగ‌ప్ర‌వేశంపై ఇదివ‌ర‌కే ఖాన్ క్లారిటీనిచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల సుహానా డెబ్యూ మూవీ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.

ఇక ఇటీవ‌ల వ‌రస ప‌రాజ‌యాల‌కు కౌంట‌ర్ గా క‌సి తీర్చుకునే రేంజు హిట్టు కొట్టాల‌న్న పంతంతో షారూక్ గ‌ట్టి ప్లాన్ తో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్ర‌ఖ్యాత య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో ప‌ఠాన్ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆన్ లొకేష‌న్ ఖాన్ బిజీబిజీగా ఉన్నారు. ఆ క్ర‌మంలోనే డాడీ సెట్లోకి వార‌సుడు ఆర్య‌న్ అడుగు పెట్ట‌డం హాట్ టాపిక్ గా మారింది. అత‌డు ఖ‌రీదై‌న ఎవ్వ‌ర్ లేటెస్ట్ మెర్సిడెస్ బెంజ్ -AMG GLE 63 కోప్ కార్ లో ఆన్ లొకేష‌న్ దిగాడు. ఇక అత‌డి రూపం చాక్లెట్ బోయ్ నే త‌ల‌పిస్తోంది. వైట్ స్వెట్ ష‌ర్ట్.. బ్లూ జీన్స్ లో అత‌డు ప్ర‌త్య‌క్ష‌మైన తీరు గాళ్స్ గుండెల్లో గుబులు రేపుతోంది. అచ్చంగా తండ్రినే పోలి ఉండే ఈ కుర్రాడు కూడా చిలిపి క‌న్న‌య్య‌గా పెద్ద తెర‌పై రొమాంటిక్ సినిమాల‌తో అల‌రిస్తాడ‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ఆర్య‌న్ ఇంత‌కుముందు య‌ష్ రాజ్ సంస్థ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం కూడా క‌ల‌క‌లం రేపింది. దానిపైనా ర‌క‌ర‌కాలుగా అభిమానుల్లో చ‌ర్చా సాగింది.

ఇక షారుఖ్ ఖాన్ అభిమానులు `ప‌ఠాన్` రిలీజ్ కోస‌మే వెయిటింగ్. ఈ రెండేళ్ల వెయిటింగ్ ఫ‌లించేంత పెద్ద హిట్టు షారూక్ అందుకుంటాడ‌నే ఆశిస్తున్నారు. ఇలాంటి వేళ కింగ్ ఖాన్ హార్డ్ వ‌ర్క్ ఎలా ఉందో చూసేందుకే ఆర్య‌న్ సెట్లోకి వ‌చ్చాడా? అన్న చ‌ర్చా సాగుతోంది. ప‌ఠాన్ లో స్నేహితుడు సల్మాన్ ఖాన్ ఒక ఆసక్తికరమైన అతిధి పాత్రలో మెర‌వ‌నుండ‌డం కూడా ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. షారుఖ్- సల్మాన్ తో పాటు పఠాన్ లో దీపికా పదుకొనే- జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జాన్ అబ్ర‌హాం ఇందులో భీక‌ర‌మైన విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. దుబాయ్ లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.