Begin typing your search above and press return to search.

ప్రియమైన తండ్రిగా హ్యాండ్సమ్ హీరో

By:  Tupaki Desk   |   31 March 2016 7:30 PM GMT
ప్రియమైన తండ్రిగా హ్యాండ్సమ్ హీరో
X
ఓ పాతికేళ్ల క్రితం దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన రోజా చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అరవింద్ స్వామి. బాలీవుడ్ లో కూడా ఈ అందగాడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే... సినిమాల ఎంపిక విషయంలో మాత్రం హిందీకి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అరవింద్ స్వామి. తనకు ఎంత క్రేజ్, డిమాండ్ ఉన్నా.. రెండంటే రెండు బాలీవుడ్ సినిమాలే చేశాడు. కెరీర్ అంతా సౌత్ లోనే కంటిన్యూ చేసి.. ఇప్పుడు సీనియర్ అయిపోయాడు.

2000వ సంవత్సరంలో రాజా కో రాణీ సే ప్యార్ హో గయా అనే చిత్రంలో చివరగా బాలీవుడ్ లో నటించిన అరవింద్ స్వామి.. మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమా చేసేందుకు సై అన్నాడు. 'డియర్ డాడ్' అనే హిందీ-తమిళ్ బై లింగ్యువల్ మూవీలో అరవింద్ స్వామి తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. 14 ఏళ్ల కొడుకు, 45 ఏళ్ల తండ్రి.. ఢిల్లీ నుంచి ముస్సోరీకి చేసే రోడ్ ప్రయాణమే ఈ డియర్ డాడ్.

ముస్సోరీలో ఓ బోర్డింగ్ స్కూల్ దగ్గరకు బయల్దేరిన తండ్రీ కొడుకులకు దారిలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులు, కొత్త పరిచయాలు, వర్షంలో ప్రకృతితో పరవశిస్తూ పాట.. ఇలా ఓ అందమైన, విభిన్నమైన జర్నీని కాన్సెప్ట్ గా తీసుకుని డియర్ డాడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు తనుజ్ భ్రమర్. తండ్రి పాత్ర విపరీతంగా నచ్చడంతోనే ఈ బాలీవుడ్ మూవీకి యాక్సెప్ట్ చేశాడట అరవింద్ స్వామి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తని ఒరువన్ రీమేక్ లో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.