Begin typing your search above and press return to search.

‘లై’లో అర్జున్ ప్రి లుక్ చూశారా?

By:  Tupaki Desk   |   5 July 2017 5:48 AM GMT
‘లై’లో అర్జున్ ప్రి లుక్ చూశారా?
X
నితిన్ తో చేస్తున్న సినిమాకు లై (lie).. అనే ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు యువ దర్శకుడు హను రాఘవపూడి. ఈ టైటిల్లోని మూడు ఇంగ్లిష్ అక్షరాలకు మూడు అర్థాలున్నాయి. ‘ఎల్’ అంటే లవ్.. ‘ఐ’ అంటే ఇంటలిజెన్స్.. ‘ఇ’ అంటే ఎనిమిటీ. ఇందులో ఆల్రెడీ ‘లవ్’ను పరిచయం చేశారు. హీరోయిన్ మేఘా ఆకాశ్ లుక్ బయటికి వచ్చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది.

ఇప్పుడు రెండో అక్షరం దగ్గరికొచ్చారు. ‘ఇంటలిజెన్స్’ను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ పాత్రకు సంబంధించిన ఇండికేషన్ అన్నమాట. బాత్ టబ్ లో సేదదీరుతున్న అర్జున్ ను వెనుక నుంచి చూపిస్తూ ప్రి లుక్ లాంచ్ చేశారు. గురువారం అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారట.

అర్జున్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఇంటలిజెన్స్’ అనే పదానికి ఇండికేషన్ గా అర్జున్ పాత్రను చెబుతున్నారంటే.. ‘ధృవ’లో అరవింద్ స్వామి తరహాలో తెలివైన విలన్ గా అర్జున్ కనిపిస్తాడేమో. ‘ఎల్’.. ‘ఐ’ అక్షరాల తర్వాత ‘ఇ’ దగ్గరికొచ్చే సరికి హీరో-విలన్ మధ్య శత్రుత్వాన్ని ఇండికేట్ చేసే లుక్ లాంచ్ చేస్తారేమో. ‘లై’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.