Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలందరూ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేట్ చేస్తే...!

By:  Tupaki Desk   |   10 Jun 2020 11:10 AM GMT
టాలీవుడ్ హీరోలందరూ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేట్ చేస్తే...!
X
సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ ఒక చోట కలవడం మనం అరుదుగా చూస్తుంటాం. సినీ ఇండస్ట్రీకి సంభందించిన వేడుకల సమయంలో.. అందరూ కలిసి చేసుకొనే ఉత్సవాల సమయంలోనో.. ఇండస్ట్రీలో ఏదైనా భారీ ఈవెంట్ జరిగితేనో.. పెళ్లిళ్ల సమయంలోనో తప్ప అలాంటిది సాధ్యం కాదు. అప్పుడు కూడా కొంతమంది హీరోలు తమ ఈగోలను పక్కన పెట్టి అలాంటి ఫంక్షన్స్ కి రావడానికి ఆసక్తి చూపించరు. నిజంగా అలా టాలీవుడ్ హీరోలందరూ ఒకే చోట కలిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు ఓ క్రియేటర్ తన టాలెంట్ తో హీరోలందరినీ ఓ ఫ్రేమ్ లో కనిపించేలా చేసాడు. ప్రస్తుతం ఆ ఇమేజినరీ కార్టూన్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది.

ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. 60వ ఏట అడుగుపెడుతున్న బాలయ్యకి సోషల్ మీడియా వేదికగా రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని వీడియోల రూపంలో ఫోటోలను అప్లోడ్ చేస్తూ వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య అభిమానులు కూడా భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. బర్త్ డే వేడుకలను జరపవద్దని బాలయ్య సూచించడంతో సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్టిస్ట్ తనలోని టాలెంటుని ఉపయోగించి టాలీవుడ్ ప్రముఖులందరూ బాలయ్య బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నట్లు కార్టూన్ రూపంలో తన ఐడియాని బయట పెట్టాడు.

ఈ కార్టూన్ లో చిరంజీవి బాలయ్య మొబైల్ లో ఏదో వీడియో చూస్తూ డిస్కషన్ చేస్తున్న ఫోటోని వాడుకున్నాడు. దీనికి మిగతా హీరోలను అటాచ్ చేస్తూ బాలయ్య బర్త్ డే థీమ్ గా క్రియేట్ చేసాడు. స్టార్ హీరోలు నాగార్జున వెంకటేష్ లు కూర్చొని మాట్లాడుకుంటుండగా పక్కనే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ రవితేజ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ నాని రానా మంచు మనోజ్ నితిన్ శర్వానంద్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ నాగచైతన్య రామ్ లు కలిసి బాలయ్య బర్త్ డే సందర్భంగా కేక్ తయారు చేస్తున్నట్లుగా కార్టూన్ గీశారు. ఈ కార్టూన్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన సినీ అభిమానులు నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. తమ ఇగోలన్నీ పక్కన పెట్టి అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.