Begin typing your search above and press return to search.
జార విడిస్తే ఛాన్సులివ్వరు తెలుగమ్మాయ్!
By: Tupaki Desk | 19 March 2020 9:32 AM ISTఆర్తి వెంకటేష్ .. హాట్ మోడల్ కం నటి. హైదరాబాదీ అమ్మాయి..పైగా తెలుగమ్మాయి.. అందరు తెలుగమ్మాయిల్లానే ఈ అమ్మడు కూడా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ఆరంభం కెరీర్ ని తమిళ మలయాళ రంగాల్లో ప్రారంభించింది. అక్కడ పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. దర్శకుడు బెజోయ్ నంబియార్ `సోలో` చిత్రంతో ఆర్తి నట రంగ ప్రవేశం చేసింది.
చెన్నయ్ లయోలా కాలేజ్ లో విజువల్ కమ్యూనికేషన్ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆర్తి అటుపై బెంగళూరు ర్యాంపు పైనా తళుకుబెళుకులు ప్రదర్శించి మలయాళంలో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వెలగాలని కలలుగంటోంది.
ఆ క్రమంలోనే ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. లేటెస్టు గా టాప్ లేపేసే ఫోటో ఒకటి అభిమానుల కోసం సోషల్ మీడియా లో షేర్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటో యూత్ లో వైరల్ గా మారింది. ఇక ఈ అమ్మడి ప్రయత్నం చూశాక అయినా మన దర్శక హీరోల చూపు అటు ప్రసరిస్తుందేమో చూడాలి. ఇప్పటికే తెలుగమ్మాయిల్లో అందాల పోటీల్లో కిరీటం దక్కించుకుని అటుపై సినీరంగంలో రాణిస్తున్న నాయికగా ఇషా రెబ్బా పాపులరైంది. కలర్స్ స్వాతి.. బిందుమాధవి లాంటి ట్యాలెంటెడ్ గాళ్స్ ఇటీవల రకరకాల కారణాలతో కనుమరుగైనా.. టాక్సీవాలా చిత్రంతో అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ కథానాయికగా పరిచయమైంది. ఇక హైదరాబాదీ మూలాలున్న అథిదీరావ్ హైదరీ ముంబై పరిశ్రమ లో రాణించి తిరిగి తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు అదే కోవలో ఆర్తి వెంకటేష్ కి అవకాశాలొస్తాయేమో చూడాలి.