Begin typing your search above and press return to search.

ఆ బంగ్లా కోసం ఎంత కష్టపడ్డారో..

By:  Tupaki Desk   |   23 Jan 2018 6:30 PM GMT
ఆ బంగ్లా కోసం ఎంత కష్టపడ్డారో..
X
దర్శకుడు ఒక కథను రాసుకున్నపుడు ఆలోచనలో పాత్రలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఒక మంచి ఆర్ట్ ఉండాలని కూడా అనుకుంటాడు. కానీ అతను దాన్ని తీర్చి దిద్దలేడు. అయితే ఆ దర్శకుడి ఆలోచనకు ప్రతి రూపం ఇవ్వడానికి ఆర్ట్ డైరెక్టర్ కృషి చేస్తాడు. మన సౌత్ లో ఎలాంటి సినిమాకైనా మంచి కళత్మకమైన సెట్స్ ని రూపొందించడానికి మంచి ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో రవీందర్ కూడా ఒకరు.

ఛత్రపతి మగధీర ఈగ మర్యాద రామన్న అత్తారింటికి దారేది సన్నాఫ్‌ సత్యమూర్తి దువ్వాడ జగన్నాథమ్‌ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇకపోతే ఇప్పుడు బాగమతి సినిమాకు కూడా రవీందర్ వర్క్ చేశారు. కథకు తగ్గట్టుగా 500 ఏళ్ల క్రితం నాటి ఒక బంగ్లా కావాలని దర్శకుడు అశోక్ కోరడంతో చాలా ప్రాంతాల్లో తీరిగినా ఎక్కడా దొరకలేదట. దీంతో రవీందర్ రీసెర్చ్ చేసి 29 రోజుల పాటు 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 మందితో అహర్నిశలు కష్టపడి నిర్మించారు. ఒక రాజు తన భార్యకు కానుకగా ఇచ్చిన బంగ్లా లా ఉండాలి కాబట్టి అన్ని వైపులా ఆలోచించారు. దాదాపు యూవీ క్రియేషన్స్ కేవలం భాగమతి బంగ్లా కోసమే రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసిందట.

ఈ రెండంతస్తుల భాగమతి బంగ్లాలో మొత్తంగా 12 గదులు ఉంటాయి. ఇక 189 స్థంబాలు ఇందులో ప్రత్యేకం. అయితే ఆ కాలంలోనే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉండేదట. కాకపోతే మనుషులు తాడు ద్వారా లిఫ్ట్ ను లాగేవారట. ఇక ఎప్పుడు వాడని కలర్ పెయింట్స్ ను ఈ బంగ్లా కోసం వాడారు. అన్ని రీసెర్చ్ చేసి రవీందర్ ఈ బంగ్లాకు రూపాన్ని ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారట. అయితే బంగ్లా ను చూడటానికి సినీ ప్రముఖులు కూడా వచ్చారట. రామ్ చరణ్ - అల్లు అర్జున్ అలాగే సాయిధరమ్ తేజ్ దర్శకులు సుకుమార్ వినాయక్ షూటింగ్ సమయాల్లో వచ్చి బంగ్లాను ప్రేత్త్యేకంగా చూశారని రవీందర్ తెలియజేశారు.