Begin typing your search above and press return to search.

విచార‌ణ‌కు సెంటిమెంట్ ను మిస్ కానీ చిన్నా

By:  Tupaki Desk   |   25 July 2017 6:04 AM GMT
విచార‌ణ‌కు సెంటిమెంట్ ను మిస్ కానీ చిన్నా
X
డ్ర‌గ్స్ విచార‌ణ కేసులో మ‌రో సినీ ప్ర‌ముఖుడు సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు. డ్ర‌గ్స్ విచార‌ణ‌లో భాగంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌న్నెండు మంది సినీ ప్ర‌ముఖుల్లో ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా ఒక‌రు. షెడ్యూల్ లో భాగంగా ఆయ‌న ప‌ది గంట‌ల వేళ‌కు సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు.

ఇంటి నుంచి నేరుగా సిట్ కార్యాల‌యానికి చేరుకున్న ఆయ‌న విచార‌ణ‌కు సిద్ధ‌మవుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌న‌కంటే ముందుగా సిట్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన సినీ ప్ర‌ముఖుల‌కు త‌గ్గ‌ట్లే చిన్నా సైతం వైట్ ష‌ర్ట్ ను వేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే సినీ ప్ర‌ముఖులు ముందుస్తుగా ముహుర్తాలు పెట్టుకొని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌టం.. ప్ర‌త్యేక పూజ‌లు చేయించ‌టం లాంటి వాటితో పాటు.. ధ‌రించే దుస్తుల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా సిట్ కార్యాల‌యానికి చేరుకున్న చిన్నా.. లైట్ గ్రే క‌ల‌ర్ ఫ్యాంటు.. హాఫ్ హ్యాండ్స్ వైట్ ష‌ర్ట్ లో హాజ‌ర‌య్యారు. చిరున‌వ్వులు చిందిస్తూ ఆయ‌న సిట్‌ కార్యాల‌యంలోకి వెళ్ల‌టం క‌నిపించింది. మొత్తం నోటీసులు అందుకున్న ప‌న్నెండు మంది సినీ ప్ర‌ముఖుల్లో విచార‌ణ‌కు హాజ‌రైన చిన్నా ఆరో వ్య‌క్తి. ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన విచార‌ణ‌లో అత్య‌ల్పంగా ఆరున్న‌ర గంట‌లు.. అత్య‌ధికంగా ప‌ద‌మూడున్న‌ర గంట‌ల పాటు విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు.
నిన్న విచార‌ణ ఎదుర్కొన్న న‌టుడు న‌వ‌దీప్ ను సిట్ అధికారులు ప‌ద‌కొండు గంట‌ల పాటు విచారించారు. మ‌రి.. చిన్నాను ఎన్ని గంట‌ల పాటు విచారిస్తారో చూడాలి.