Begin typing your search above and press return to search.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్..

By:  Tupaki Desk   |   27 Dec 2021 3:50 PM IST
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్..
X
వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో ఉండే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు గట్టి షాక్ తగిలింది.. ఓ కేసులో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. బండ్ల గణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ ఇచ్చిన 1.25 కోట్ల చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరుకావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఈ క్రమంలోనే నేడు కోర్టులో హాజరు కానున్నారు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ పై ఏపీలోనే గతంలో మరో కేసు కూడా నమోదైంది. అది కూడా డబ్బులకు సంబంధించిన వ్యవహారమే. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు బండ్ల గణేష్ తీసుకున్నారట.. తిరిగి చెల్లించకపోవడంతో బండ్ల గణేష్ పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

కోర్టు విచారణకు బండ్ల గణేష్ హాజరు కాకపోవడంతో ఆయనపై అప్పట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ కడప మెజిస్ట్రేట్ జారీ చేశారు. అనంతరం బండ్లను అరెస్ట్ చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు.