Begin typing your search above and press return to search.

నార్త్ లో RRR బిగ్గెస్ట్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు.. గెస్ట్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   17 Dec 2021 11:03 AM GMT
నార్త్ లో RRR బిగ్గెస్ట్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు.. గెస్ట్ ఎవరంటే..?
X
యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ను 2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

RRR విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ జక్కన్న తన ప్రమోషనల్ స్ట్రాటజీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చే ప్రతీ కంటెంట్ ను జనాల్లోకి తీసుకెళ్లిన రాజమౌళి అండ్ టీమ్.. ఇటీవల ట్రైలర్ లాంచ్ తో భారీ హైప్ తీసుకొచ్చారు.

మూడు నిమిషాలకు పైగా నిడివితో థియేట్రికల్ ట్రైలర్ ను కట్ చేసి ముందుగా థియేటర్లలో ప్రదర్శించారు. ఈ క్రమంలో ముంబై - బెంగుళూరు - చెన్నై - హైదరాబాద్ లలో ప్రెస్ మీట్స్ పెట్టి.. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇదే క్రమంలో ఇప్పుడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

సాధారణంగా సినిమా విడుదలకు ముందుకు భారీ స్థాయిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు చోట్లా వేర్వేరు కార్యక్రమాలు చేయడం చూశాం. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న RRR మూవీ కోసం మేకర్స్ అనేక ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ముందుగా 'ఆర్.ఆర్.ఆర్' హిందీ వెర్సన్ కు సంబంధించిన ఈవెంట్ మీద దృష్టి పెట్టారు. ముంబైలో డిసెంబర్ 19న గ్రాండ్ గా ఈవెంట్ జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలో రోర్ ఆఫ్ RRR కోసం వస్తున్నామని చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇకపోతే RRR కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరుకానున్నారని సమాచారం. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ తో పాటుగా సల్మాన్ ఖాన్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ కు కండలవీరుడే హోస్టింగ్ చేస్తారని అంటున్నారు. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

రాజమౌళి 'బాహుబలి' తరహాలోనే 'RRR' చిత్రానికి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి అదే మాదిరిగా కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి. కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.