Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 6 లీక్ : టీవీ9 యాంకర్‌ ఎలిమినేట్‌

By:  Tupaki Desk   |   2 Oct 2022 5:49 AM GMT
బిగ్‌ బాస్‌ 6 లీక్ : టీవీ9 యాంకర్‌ ఎలిమినేట్‌
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్‌ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నాల్గవ వారంలో ఏకంగా పది మంది ఎలిమినేషన్ కి నామినేట్‌ అవ్వడంతో వారిలోనుండి సుదీప లేదా ఆరోహి ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

ఆదివారం ఎపిసోడ్‌ లో ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు అనే విషయం లో క్లారిటీ రాబోతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ టీమ్‌ నుండి లీక్ వచ్చేసింది. ఆరోహీ రావ్‌ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది. టీవీ9 యాంకర్ అయిన ఆరోహీ రావ్‌ ఎలిమినేట్‌ అయినట్లుగా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

టీవీ9 లో ఆరోహీ రావు ఇస్మార్ట్‌ న్యూస్ లో సందడి చేసే విషయం తెల్సిందే. హౌస్‌ లో ఆర్జే సూర్య తో పాటు అందరితో కూడా సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించిన ఆరోహీ రావు చేసిన చిన్న చిన్న తప్పిదాల కారణంగా ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్‌ చేసినట్లుగా బిగ్ బాస్ విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు.

ఆరోహీ ఎలిమినేట్‌ అయిన తర్వాత ఆర్జే సూర్య ఆట బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆరోహీ తెలంగాణ యాసలో మాట్లాడే మాటలు మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ కి కొందరు ఫ్యాన్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఆమె నాలుగు వారాలకే ఎలిమినేట్‌ అవ్వాల్సి వచ్చింది పాపం.

ఇక శనివారం ఎపిసోడ్‌ లో హోస్ట్‌ నాగార్జున హోటల్ టాస్క్ లో ప్రదర్శన ఆధారంగా టిప్స్ ఇచ్చారు. కొందరికి టిప్‌ ఇవ్వలేదు.. కొందరికి వెయ్యి.. అయిదు వందలు అలా ఇచ్చారు. టిప్ అస్సలు దక్కని వారిలోంచి ఒకరిని ఎంపిక చేసి ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత కోల్పోతాడు అన్నారు. హౌస్ లో మెజార్టీ నిర్ణయం చంటికి వ్యతిరేకంగా రావడంతో ఆయన సీజన్ మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ గా అనర్హుడు.