Begin typing your search above and press return to search.

'అర్జున్' ఈ సారైనా వస్తాడా ?

By:  Tupaki Desk   |   5 Oct 2019 2:00 PM GMT
అర్జున్ ఈ  సారైనా  వస్తాడా ?
X
ఏ ముహూర్తాన నిఖిల్ 'కనిథన్' రీమేక్ స్టార్ట్ చేశాడో కానీ అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ కుర్ర హీరోకి నిద్ర లేకుండా చేసింది. దాదాపు వారం పైనే టైటిల్ వివాదం నడిచింది. ఆ తర్వాత టైటిల్ మార్చుకొని 'అర్జున్ సురవరం' గా ప్రమోషన్స్ మొదలెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఏదో కారణం చేత పోస్ట్ పోన్ అయింది. ఇంకో డేట్ అనుకున్నారు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఓ స్టేజిలో ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా ? లేదా అనే టాక్ వచ్చేసింది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు ఇప్పుడు మోక్షం లభించింది. మూడు నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపో మాపో నిఖిల్ ఈ డేట్ ను అనౌన్స్ చేసి సినిమా మీద మళ్ళీ బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓ నెల పాటు ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.

అయితే 'అర్జున్ సురవరం' వచ్చేస్తుంది అంటూ నిఖిల్ డేట్ అనౌన్స్ చేయగానే ఈ సారైనా రిలీజ్ అవుతుందా అనే కామెంట్స్ మాత్రం కచ్చితంగా పడతాయి. అందులో సందేహమే లేదు. మరి వాటికి నిఖిల్ ఎలా రిప్లై ఇస్తాడో.. ఈసారి ఈ సినిమా డేట్ గురించి ఏం చెప్తాడు చూడాలి.