Begin typing your search above and press return to search.

బయోపిక్ లో యంగ్ సచిన్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   13 Feb 2017 5:30 PM GMT
బయోపిక్ లో యంగ్ సచిన్ ఎవరంటే..?
X
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకొని ఇప్పుడున్న అత్యధిక కలెక్షన్ల రికార్డుల్ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా వచ్చిన బయోపిక్ లకు ప్రేక్షకుల ఆదరణ భారీగా ఉండటంతో.. ఆ దిశగా ప్రముఖుల లైఫ్ స్టోరీల్ని సినిమాలుగా తీసే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది.

ఇదే క్రమంలో లెజెండరీ.. క్రికెట్ దేవుడిగా కీర్తించే సచిన్ టెండూల్కర్ జీవితం మీద ఒక చిత్రాన్ని తీస్తున్నారు. ‘‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’’ పేరిట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా తాజాగా వెల్లడించారు. ఈ వార్త సచిన్ అభిమానులకు.. క్రికెట్ ప్రేమికులకు పండగనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబందించిన మరో ఆసక్తికర విషయాన్ని క్రికెట్ దేవుడు స్వయంగా వెల్లడించారు.

ఈ చిత్రంలో యంగ్ సచిన్ గా క్రికెట్ దేవుడి కుమారుడు అర్జున్ కనిపిస్తాడని వెల్లడించారు. జేమ్స్ ఎర్స్ కన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సచిన్ కుమారుడు యంగ్ సచిన్ గా నటించారన్న మాట.. ఈ చిత్రంపై క్రేజ్ ను మరింత పెంచటం ఖాయమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/