Begin typing your search above and press return to search.

అర్జున్ సురవరం రెండు వారాల వసూళ్లు

By:  Tupaki Desk   |   14 Dec 2019 4:36 PM IST
అర్జున్ సురవరం రెండు వారాల వసూళ్లు
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'అర్జున్ సురవరం' నవంబర్ 29 న విడుదలయింది. ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాకు డీసెంట్ రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ దక్కాయి. పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో రెండు వారాల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసుకుంది.

'అర్జున్ సురవరం' సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ.6 కోట్లు. ఈ సినిమా రెండు వారాలకు గానూ ప్రపంచవ్యాప్తంగా రూ. 9.54 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.36 కోట్లు వసూలు చేసి నిఖిల్ కెరీర్ లో హిట్ గా నిలిచింది. ఈమధ్య హీరో నిఖిల్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో 'అర్జున్ సురవరం' మంచి కలెక్షన్స్ సాధించి ఇద్దరికీ పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

'అర్జున్ సురవరం' రెండు వారాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఫిగర్స్ అన్నీ రూపాయలే.

నైజాం: 3.62 cr

ఉత్తరాంధ్ర: 1.02 cr

సీడెడ్: 0.90 cr

ఈస్ట్: 0.57 cr

గుంటూరు: 0.69 cr

వెస్ట్: 0.49 cr

కృష్ణ: 0.65 cr

నెల్లూరు: 0.42 cr

ఏపీ & తెలంగాణా టోటల్: 8.36cr

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా: 0.55 cr

ఓవర్సీస్: 0.63 cr

వరల్డ్ వైడ్ టోటల్: 9.54 cr