Begin typing your search above and press return to search.

అన్నీ ముద్దులూ రిలీజ్ చేయాలా!!

By:  Tupaki Desk   |   1 March 2017 6:18 PM GMT
అన్నీ ముద్దులూ రిలీజ్ చేయాలా!!
X
ఒక సినిమాలో ఏదైనా లిప్ లాక్ సీన్ ఉందంటే చాలు.. దాని గురించి నానా హడావుడి చేసి ప్రచారానికి వాడేసుకుంటూ ఉంటారు సినిమా జనాలు. అదిగో ఇప్పుడు ''అర్జున్ రెడ్డి'' టీమ్ ఆల్రెడీ వచ్చిన బజ్ ను దృష్టిలో ఉంచుకుని సేమ్ అలాగే చేస్తోంది.

మొన్ననే టీజర్లో ఒక బూతుమాట.. అలాగే హీరోయిన్ ను ఘాడంగా దగ్గరకు లాక్కొనే సీన్ ఒకటి చూపించడంతో.. సినిమాకు విపరీతమైన బజ్ వచ్చేసింది. అంతకంటే ముందే సినిమాలో లిప్ కిస్ సీన్ చేయడం కోసం హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ షాలిని వడ్నికట్టి లు కాసేపు ఘాట్టిగా చుంబించుకుని మరీ సన్నద్దమయ్యారు. ఆ మేకింగ్ వీడియో కూడా మనకు చూపెట్టేవారు. ఇప్పుడు సినిమాలో వారు చేసిన ఈ కిస్సింగ్ సీన్ కు సంబంధించిన ఫోటో బయటకొచ్చింది. సారీ.. ఒక్క ఫోటో కాదు.. ఏకంగా ఆ షాట్లో ఉన్న ఫ్రేమ్స్ అన్నీ రిలీజ్ చేసేశారు నిర్మాతలు. మరీ అన్ని ముద్దులూ రిలీజ్ చేయాలంటారా?

సంచలనం సృష్టించడానికి పలు మార్గాలు. వాడుకోద్దంటే ఎలా. ఇప్పుడు అదే పంథాలో ఈ అర్జున్ రెడ్డి గ్యాంగ్ దూసుకుపోతోంది. చూద్దాం కంటెంట్ తో ఇంకెన్ని సర్పరైజ్ లు ఇస్తారో వీళ్ళు.