Begin typing your search above and press return to search.

2017లో జక్కన ఫెవరేట్ సినిమా అదే

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:58 PM GMT
2017లో జక్కన ఫెవరేట్ సినిమా అదే
X
టాలీవుడ్ కి 2017 చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే చిరకాలం గుర్తుండి పోయే సినిమాలు ఎన్నో ఈ ఏడాది ప్రేక్షకులను చాలా అలరించాయి. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారిగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని సైతం ఆ సినిమా కుదిపేసింది. ఇక మరో తెలుగు సినిమా కూడా ఇతర భాషల ప్రముఖులను ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది. అదే అర్జున్ రెడ్డి సినిమా.

విడుదలకు ముందు కొన్ని వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత జనాలను ఎంతో ఆకట్టుకుంది. టాలీవుడ్ కి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చినా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చేసింది. అయితే మన సినీ ప్రముఖులను కూడా ఆ సినిమా చాలానే ఆకర్షించింది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం సెన్సేషన్ అయ్యింది. అంతే కాకుండా బాహుబలి దర్శకుడికి కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. బాహుబలి 2 తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసినా కూడా తనకు ఈ ఏడాది బాగా నచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అని జక్కన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటన తనను చాలా ఆకట్టుకుందని చెబుతూ.. హీరోయిన్ కూడా చాలా బాగా నటించిందని చెప్పారు. ఇక దర్శకుడి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని జక్కన్న ప్రశంసలను అందించాడు. అర్జున్ రెడ్డితో పాటు ఘాజి - ఫిదా వంటి సినిమాలు కూడా చాలా నచ్చాయని రాజమౌళి వివరించాడు.