Begin typing your search above and press return to search.

‘అర్జున్ రెడ్డి’ని ఆకాశానికెత్తిన ప్రిన్స్‌!

By:  Tupaki Desk   |   1 Sep 2017 5:40 PM GMT
‘అర్జున్ రెడ్డి’ని ఆకాశానికెత్తిన ప్రిన్స్‌!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ కు ‘అర్జున్ రెడ్డి’ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. వివాదాల‌తో ప్రారంభ‌మైన ఈ సినిమాలో అంతే స్థాయిలో కంటెంట్ ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్రేక్ష‌కుల‌తో పాటు స్టార్ హీరోలు - డైరెక్ట‌ర్ లు కూడా అర్జున్ రెడ్డికి ఫిదా అయిపోయారు. ఆ సినిమా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ....టాలీవుడ్ లియెనార్డో డికాప్రియో అని వ‌ర్మ తెగ పొగిడేసిన సంగ‌తి తెలిసిందే. జ‌క్క‌న్న కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. తాజాగా ఆ జాబితాలోకి ప్రిన్స్ మ‌హేష్ బాబు చేరిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా సినిమాపై త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు మ‌హేష్‌.

‘అర్జున్ రెడ్డి’ సినిమాపై మ‌హేష్‌ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ సినిమా అద్భుతంగా ఉంద‌ని మెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఎంతో నేచుర‌ల్ గా, బోల్డ్ గా - ఇంటెన్స్ గా తీశార‌న్నాడు. అన్ని సినిమాలూ వెళ్లే దారిలో కాకుండా కొత్తగా తీశార‌ని వరుస ట్వీట్లతో ప్ర‌శంసించాడు. మూస సినిమాల‌కు ఈ సినిమాతో బ్రేక్ ప‌డుతుంద‌న్నాడు. హీరో విజ‌య్ దేవ‌రకొండ న‌ట‌న అద్భుత‌మ‌న్నాడు. హీరోయిన్‌ షాలిని, సినిమాలో మిగ‌తా పాత్ర‌లు బ్రిలియంట్ గా ఉన్నాయ‌న్నాడు. ఇది సందీప్ వంగా మొద‌టి సినిమా అంటే న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని, ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా చిత్రీక‌రించాడ‌ని చెప్పాడు. మీకు మీ టీమ్ కి కంగ్రాట్స్ స‌ర్ అంటూ అర్జున్ రెడ్డిని ఆకాశానికెత్తేశాడు ప్రిన్స్‌.