Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి హార్ట్ అలా చెప్పిందట

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:24 AM GMT
అర్జున్ రెడ్డి హార్ట్ అలా చెప్పిందట
X
కురుక్షేత్రంలో ఒక్కసారిగా అర్జునుడు తన బలాన్ని మొత్తం చూపించినట్టు సినీ క్షేత్రంలో తన బాక్స్ ఆఫీస్ స్టామినాను చూపించాడు అర్జున్ రెడ్డి. ఈ సినిమా హీరో పేరు విజయ్ సాయి దేవరకొండ అయినా ఆ సినిమా చూసిన తర్వాత అందరు అర్జున్ రెడ్డి అనే పిలవడం మొదలు పెట్టారు. ఈ పేరు ఎంత వరకు కంటిన్యూ చేస్తాడో గాని ప్రస్తుతం విజయ్ మాత్రం డిఫెరెంట్ సినిమాలను చేస్తున్నాడు.

ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ హీరో ఇప్పుడు మరొకరికి అవకాశం ఇవ్వలేనంత బిజీ అయ్యాడు. ప్రస్తుతం చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. దీంతో షూటింగ్ లతో విజయ్ చాలా బిజీ అయ్యాడు. అయితే రీసెంట్ గా ఈ హీరోకి సడన్ గా ఒక జ్ఞానోదయం అయ్యిందట. ఇటీవల మహేష్ బాబు సోదరి మంజుల 'ఫాలో యువర్ హార్ట్' అనే షో రీల్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది చూసిన ప్రముఖులు చాలా మంది మంజులను చాలా ప్రశంసించారు. అందరు ఆమె తెలియజేసిన జీవిత సత్యాలకు ఫిదా అయిపోయారు. తను చెప్పింది కరెక్ట్ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే విజయ్ మాత్రం ఆచరణలో పెట్టి చూపించాడు.

మంజుల చెప్పిన మనసుకు నచ్చింది చెయ్యి అనే పాయింట్ తీసుకొని తన మనసుకు నచ్చిన పని చేశాడు. ఘాటింగ్ క్యాన్సిల్ అని చెబుతూ.. హార్ట్ చెప్పింది హాయిగా నిద్రపొమ్మని..అంటూ సోషల్ మీడియా లో కామెంట్ పెట్టి తను నిద్రపోవడానికి రెడీగా ఉన్నట్లు ఒక ఫొటో ద్వారా తెలియజేశాడు. అయితే షూటింగ్ క్యాన్సిల్ చేయడం అంటే ప్రొడ్యూసర్ కు నష్టమేగా? కాదా? అప్పుడు ప్రొడ్యూసర్ హార్టును కూడా ఓమారు అడగాలి.. ఆయనకు ఏం చెప్పిందో.