Begin typing your search above and press return to search.

జియో ట‌వ‌ర్ లా ఉందీ `అర్జున్ రెడ్డి` జియా

By:  Tupaki Desk   |   4 Jun 2021 7:00 AM IST
జియో ట‌వ‌ర్ లా ఉందీ `అర్జున్ రెడ్డి` జియా
X
2017లో `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైంది కులు మ‌నాలి బ్యూటీ జియా శ‌ర్మ‌. హిమ‌చ‌ల్ ప్రదేశ్ కి చెందిన ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన జియా మోడ‌లింగ్ న‌ట‌న‌పై ఆస‌క్తితో ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టించింది. అటుపై ల‌ఘుచిత్రాల‌తో పాపుల‌రై దేశీ రోమియోస్ అనే పంజాబీ చిత్రంలో న‌టించింది. అలాగే స్విచ్చాఫ్ అనే ల‌ఘు చిత్రంలోనూ జియా న‌టించింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డిలో షాలినితో పాటు స‌హాయ‌క పాత్ర‌లో క‌నిపించిన జియా త‌దుప‌రి టాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. అయితే మిడిల్ క్లాస్ అమ్మాయి.. పైగా ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని ఈ బ్యూటీకి తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాల్లేవ్. మునుముందు వెబ్ సిరీస్ లలో క‌నిపించే వీలుంద‌ని స‌మాచారం.

జియా ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ పైనా దృష్టి సారించింది. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో వ‌రుస‌గా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. జియా బ్లూ డ్రెస్ లో త‌ళుక్కుమ‌న్న ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. రెండు భారీ కార‌వ్యాన్ ల న‌డుమ ఇలా జియా ఇచ్చిన ఫోజు వెబ్ ని షేక్ చేస్తోంది. అనుష్క‌లా ఒడ్డు పొడుగు ఉన్న ఈ బ్యూటీకి ఆ హైటేమైనా మైన‌స్ అయ్యిందా? అన్న‌ది త‌నే విశ్లేషించాలి.