Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ తో అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడి జ్ఞాప‌కాలు

By:  Tupaki Desk   |   19 July 2021 2:34 PM GMT
ప‌వ‌ర్ స్టార్ తో అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడి జ్ఞాప‌కాలు
X
తెర‌కెక్కించిన మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌నాలు సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా. `అర్జున్ రెడ్డి`.. `కబీర్ సింగ్` చిత్రాల‌ ద‌ర్శ‌కుడిగా జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్ లోకొచ్చాడు. అయితే సందీప్ మూలాలు మాత్రం తెలుగునే ఉన్నాయి. అత‌డు మెగాభిమాని. మెగాస్టార్ చిరంజీవి ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు గొప్ప అభిమాని. ఈ విష‌యాన్ని చాలా ఇంట‌ర్వ్యూల్లో సందీప్ బాహాటంగానే చెప్పారు. డైరెక్ట‌ర్ కాక‌ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేద్దామా? అనే ఆస‌క్తిని క‌లిగి ఉన్నాన‌ని ఆయ‌న చెప్పారు. కానీ అది అంత ఈజీ కాద‌ని కాల‌క్ర‌మేణా తెలుసొచ్చింది.

కానీ ఇప్పుడు ప‌వ‌న్ తో అవ‌కాశం అందుకోవ‌డం అత‌డికి క‌ష్ట‌మేమీ కాదు. తాను ఆ స్థాయికి చేరుకున్నారు. స‌రైన స్క్రిప్ట్ తో ప‌వ‌న్ ని అప్రోచ్ అయితే అభిమానిగా అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఆ విష‌యాలు ప‌క్క‌న బెడితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సందీప్ కు ఎంత అభిమాన‌మో మ‌రోసారి నిరూపించుకున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త సినిమాల పోస్ట‌ర్ల‌న్నిటినీ ఒకచోట‌కు చేర్చి వాటిని అందంగా పేర్చి ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. వాటిలో జానీ సినిమా పోస్ట‌ర్లు రెండు.. ఖుషీ పోస్ట‌ర్లు రెండు.. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ బేవ‌రేజెస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ఉన్న ఫోటోని పంచుకుని షేర్ చేసి త‌న జ్ఞాప‌కాల్ని సందీప్ పంచుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో జానీ ఆడియో క్యాసెట్ చూసి 90వ ద‌శకం నాటి రోజులు గుర్తొచ్చాయ‌ని నెమ‌ర వేసుకున్నారు. ఈ సినిమాలు.. పోస్ట‌ర్లు త‌న‌ని 20 ఏళ్ల క్రితం వెన‌క్కి తీసుకెళ్తాయ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీది ఎంతో మ‌ధుర‌మైన జ్ఞాప‌కంగా నిలుస్తాయ‌ని అభిప్రాయప‌డ్డారు.

ఇవ‌న్నీ `జ్ఞాప‌కాల గోల్డ్ మైన్స్` అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించి ట్వీట్ చేసి ప‌వ‌న్ అభిమానుల్లోకి వ‌దిలారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఒక్క‌సారిగా ప్ర‌తి స్పంద‌న‌ల‌తో ఎటాక్ ప్రారంభించారు. త‌మ‌దైన శైలిలో ప‌వ‌న్ పై...సందీప్ వంగపై కామెంట్లు పెట్టి సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రి ఒక్క‌సారిగా సందీప్ వంగా ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ జ్ఞాప‌కాల్లో ఎందుకు వెళ్లిన‌ట్లు? ఓ సాధార‌ణ అభిమానిగా ఇలా గుర్తు చేసుకుంటున్నారా? లేక ప‌వ‌న్ తో త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునే ఛాన్స్ ద‌క్కింద‌ని ఈ రూపంలో దానిని బ‌య‌ట‌పెడుతున్నారా? అన్న‌దానికి సందీప్ వంగ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఒక‌వేళ ప‌వ‌న్ తో సందీప్ కి సినిమా చేసే అవ‌కాశం ద‌క్కితే అది ఎలా ఉంటుందో కూడా అత‌డు చెబుతాడేమో చూడాలి. ప్ర‌స్తుతం సందీప్ వంగా బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా యానిమ‌ల్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా లుక్ కూడా రిలీజైంది. సెకండ్ వేవ్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతోంది.

యానిమ‌ల్ ఎప్పుడు?

యానిమ‌ల్ చిత్రాన్ని 2022 ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. కానీ ప్ర‌స్తుత సందిగ్ధ‌త దృష్ట్యా ఇన్ టైమ్ లో రిలీజ‌వుతుందా ఇంకా ఆల‌స్య‌మ‌వుతుందా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ స‌ర‌స‌న ప‌రిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప‌రిణీతి ఇటీవ‌ల వ‌ర‌స చిత్రాల‌తో న‌టిగా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంటున్న సంగ‌తి తెలిసిన‌దే. అనీల్ క‌పూర్ .. బాబి డియోల్ లాంటి వెట‌ర‌న్ స్టార్లు కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. ఇక యానిమ‌ల్ టైటిల్ పైనా ఈ సినిమా క‌థాంశంపైనా సోష‌ల్ మీడియాల్లో ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. మ‌రోసారి క‌బీర్ సింగ్ త‌ర‌హాలోనే హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో సందీప్ వంగా స‌ర్ ప్రైజ్ చేస్తాడ‌నే భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో నిత్యం గొడ‌వ‌లు ప‌డే తండ్రి కొడుకుల రిలేష‌న్ షిప్ ని వ‌యొలెంట్ కంటెంట్ తో చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎంచుకున్న థీమ్ లైన్ క‌చ్ఛితంగా థ్రిల్ చేస్తుంద‌న్న టాక్ వినిపిస్తోంది.