Begin typing your search above and press return to search.

హిందీ అర్జున్‌ రెడ్డి రిలీజ్ తేదీ

By:  Tupaki Desk   |   1 Aug 2018 6:45 AM GMT
హిందీ అర్జున్‌ రెడ్డి రిలీజ్ తేదీ
X

విజ‌య్ దేవ‌ర‌కొండ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం `అర్జున్‌ రెడ్డి`. సందీప్ వంగ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షాలిని పాండే క‌థానాయిక‌గా న‌టించింది. ప్రేమ‌లో నిజాయితీ ఉన్న ఓ మెడికో క‌థ ఇది. రాముడు మంచి బాలుడు లాంటి కుర్రాడు డ్ర‌గ్ అడిక్ట్ అయితే.. అత‌డు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో ర‌గ్గ్‌డ్‌ గా చూపించ‌డంలో సందీప్ 400శాతం స‌క్సెస‌య్యాడు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెలుగు జ‌నాల‌కు చూపించ‌డంలో విజ‌యం సాధించాడు. అందుకే ఈ సినిమా 40 రెట్లు లాభాలు పండించింది.

ఈ సినిమాతో దేవ‌ర‌కొండ‌ - షాలినిల‌కు ఎంత పేరొచ్చిందో అంత‌కుమించి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాకు పేరొచ్చింది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా హిందీ రీమేక్‌ ని తెర‌కెక్కించేందుకు అవ‌కాశం ద‌క్కింది. హిందీలో షాహిద్ క‌పూర్ లాంటి స్టార్ హీరో అర్జున్‌ రెడ్డి పాత్ర‌లో న‌టించేందుకు అంగీక‌రించ‌డం ఉత్కంఠ రేపింది. ర‌ఫ్‌ గా న‌టించ‌డంలో ర‌ఫ్ఫాడేసే ట్రాక్ రికార్డ్ మ‌నోడి సొంతం. అందుకే బాలీవుడ్‌ లోనూ ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని డిక్లేర్ అయిపోయారు. ఈ ఆగ‌స్టులోనే సినిమా సెట్స్‌ పైకి వెళుతోంది. ఇంకా సెట్స్‌ కెళ్ల‌క ముందే రిలీజ్ తేదీని ప్ర‌క‌టించేశారు. 21 జూన్ 2019న రిలీజ్ చేస్తున్నార‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించారు. ఈ సినిమాతో తెలుగ‌బ్బాయ్ సందీప్ రెడ్డి అక్క‌డా ఇర‌గ‌దీస్తాడా?.. అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.