Begin typing your search above and press return to search.

పిన్నితో బాండింగ్ లేదని చెప్పేశాడు

By:  Tupaki Desk   |   20 May 2017 10:16 AM GMT
పిన్నితో బాండింగ్ లేదని చెప్పేశాడు
X
నిన్ననే హీరో అర్జున్ కపూర్ కొత్త సినిమా ''హాఫ్‌ గాళ్‌ ఫ్రెండ్'' రిలీజైంది. చేతన భగత్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న అర్జున్ కపూర్ కు.. ఇప్పుడు మీ చెల్లి (సవతి చెల్లి) జాన్వి కపూర్ కూడా సినిమాల్లోకి వస్తుందని అంటున్నారు.. ఆల్రెడీ మరో చెల్లి సోనమ్ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న వేళ.. ఇప్పుడు జాన్వి గురించి ప్రశ్నలు సహజమే. కాని అర్జున్ వాటికి సమాధానం చెబుతాడా?

''నాకు 11 ఏళ్ళ వయసున్నప్పుడు మా నాన్న మా అమ్మకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నాడు. అప్పుడు మేం చాలా కష్టాలుపడ్డాం. నాకు శ్రీదేవితో కాని ఆమె కూతుళ్లతో కాని పెద్దగా రిలేషన్ లేదు. కలిసిందే చాలా తక్కువ. ఇక నేను మా అమ్మ బ్రతికుండగా పెద్దగా ఏం సాధించలేదు. ఈ సక్సెస్ కాస్త ఎర్లీగా వచ్చుంటే మా అమ్మ ఆనందించి ఉండేది'' అంటూ సమాధానం ఇచ్చేశాడు. మరి అతని యాంగిల్లోనుండి చూస్తే.. శ్రీదేవి రాకతోనే వారి జీవితాలు మారిపోయాయ్. అందుకే మనోడు పిన్ని గురించి.. పిన్ని కూతుళ్ల గురించి.. ఏమని చెబుతాడులే.

ఇకపోతే హాఫ్‌ గాళ్‌ ఫ్రెండ్ సినిమాకు యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి కాని.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలక్షన్ వస్తుందనే విషయం చూడాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా బాహబులి క్రేజ్ దులిపేస్తున్న వేళ... ఈ విధంగా తన సినిమాతో అర్జున్ కపూర్ ఎదురెళ్ళాడనే చెప్పాలి. ట్రేడ్ ఎలా ఉందనేది సోమవారం తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/