Begin typing your search above and press return to search.
కొత్త జంటతో కాబోయే జంట?!
By: Tupaki Desk | 2 Dec 2018 5:11 AM GMTఆయనేమో గబ్బర్ సింగ్ లా దిగాడు.. ఆవిడేమో భాగ్యలక్ష్మిలా దిగింది. ఇంకేం ఉంది ఆ రిసెప్షన్ వేడుకలో కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే. కాబోయే కొత్త జంట భలే గెటప్‌లో దిగారు! అంటూ జనం ఒకటే తెగ చెవులు కొరుక్కున్నారు. ఇంతకీ ఎవరీ కాబోయే జంట అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన పనేం లేదు. ఆయన పేరు అర్జున్ కపూర్ - ఆవిడ పేరు మలైకా అరోరాఖాన్. ఈ జంట ప్రేమాయణం గత కొంతకాలంగా మీడియాలో కథలు కథలుగా ఎపిసోడ్ ఎపిసోడ్లుగా వినవస్తూనే ఉంది.
ఇంతకీ ఈ జంట ఏ జంట వేడుకలో దిగారు? అంటే.. దీపిక- రణవీర్ సింగ్ రిసెప్షన్ లో ఇలా దిగారన్నమాట. ముంబై లో అదిరిపోయే లెవల్లో ఈ పార్టీని చేసింది కొత్త జంట. ఇటలీ లేక్ కోమోలో పెళ్లికి అందరినీ ఆహ్వానించలేకపోయారు కాబట్టి, బ్యాలెన్స్ మిత్రులందరి కోసం ఆ జోడీ ముంబైలో రిసెప్షన్‌ని ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు అర్జున్ కపూర్ - మలైకా విడివిడిగా విచ్చేశారు. అయితే ముందే అనుకున్నారో ఏమో ఇద్దరూ బులుగు జిలుగు కాంబినేషన్ డ్రెస్ లోనే దర్శనమివ్వడం అక్కడ చర్చకొచ్చింది. మలైకా బ్లూ వాటర్ ఫాల్స్ శారీ పైనే జనాల కళ్లన్నీ. అలాగే బ్లూ సూటు- బూటులో దిగిన రణవీర్ బ్లాక్ కలర్ హ్యాట్ ధరించి - కోరమీసం తిప్పాడు. మొత్తానికి ఈ జంట ప్రధాన ఆకర్షణగా నిలిచింది అక్కడ.
మరోవైపు అర్జున్ కపూర్ ని పెళ్లాడేందుకు మలైకా రెడీ అవుతోందన్న వార్తల నడుమ ఆ ఇద్దరిపైనే బాలీవుడ్ మీడియా ఫోకస్ చేయడంతో రచ్చరచ్చవుతోంది. ఎంతగా దానిని దాచేద్దామని చూసినా - ఆ ఇద్దరూ దాచలేక దొరికిపోతున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో హాట్ కపుల్ గా ఈ జంట వేడెక్కిస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ కంటే ఆ ఇద్దరిపైనా ప్రస్తుతం ఎఫైర్ కహానీలే ముదిరిపాకన పడడంపైనా వాడి వేడిగా చర్చ సాగుతోంది.