Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పార్టీ గాళ్స్ దింతాన‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 10:24 AM GMT
ఫోటో స్టోరి: పార్టీ గాళ్స్ దింతాన‌
X
బాలీవుడ్‌ లో పార్టీ క‌ల్చ‌ర్ విచ్చ‌ల‌విడిత‌నంపై ఇప్ప‌టికే బోలెడంత నెగెటివ్ టాక్ ఉంది. అదే క‌ల్చ‌ర్‌ని టాలీవుడ్‌ కి ఇంపోర్ట్ చేసుకోవ‌డం ఇటీవ‌లే డ్ర‌గ్స్ స్కాండ‌ల్‌ లో పెద్ద రేంజులో చ‌ర్చ‌కు తావిచ్చింది. అమెరికా నుంచి ముంబై - హైద‌రాబాద్‌ వ‌ర‌కూ రంగుల ప్ర‌పంచంలో పార్టీ క‌ల్చ‌ర్ ఊహించ‌నంత పెద్ద స్థాయిలో విస్త‌రించి ఉంది. వీకెండ్స్‌లో క్ల‌బ్బు - ప‌బ్బు కాదేదీ తాగి ఊగేందుక‌నర్హం అన్న చందంగా సెల‌బ్రిటీలు రెచ్చిపోతున్నారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఇటీవలి ప‌రిణామాలు ఈ క‌ల్చ‌ర్‌ని కొంత అదుపు లోకి తెచ్చిన మాట వాస్త‌వం. కానీ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో మాత్రం సెల‌బ్రిటీలు ఆడిందే ఆట పాడిందే పాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్క‌డ రేయి ప‌గ‌లు.. ప‌గలు రేయిలా మార‌తాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ శుక్ర‌వారం నైట్‌ క‌పూర్ బోయ్ మహీప్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ టాప్ గాళ్స్ ఓ రేంజులో విందు చేసుకున్నారు. తాగి తూలి ప‌డ‌డ‌మే కాదు, రేయంతా రేవ్ పార్టీతో రేవు పెట్టేశార‌ని ఈ ఫోటోలు చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఈ పార్టీలో హాట్ ల‌వ‌ర్స్ మ‌లైకా అరోరాఖాన్- అర్జున్ క‌పూర్ ఉన్నారు. కరీనా కపూర్ ఖాన్ - అమృత అరోరా - సోఫీ చౌదరి - సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్ ఇలా ఫేజ్ 3 గాళ్స్ అంతా ఉన్నారు.

న‌డి రేయిలో జ‌రిగిన ఈ పార్టీలో ఖ‌రీదైన వైన్‌ని గుట‌కాయ స్వాహా చేశారు ఈ కొంటె లేడీ బ్యాచ్‌. అటుపై ఫుల్‌ గా డ్యాన్సుల‌తో.. పూర్తిగా అదుపుత‌ప్పిన వాల‌కం అక్క‌డ క‌నిపిస్తోంది. ఇక ఫోటోల‌కు ఫోజులివ్వ‌డంలోనూ వీళ్లు అంతే రెచ్చిపోయారు. ముఖ్యంగా అర్జున్ క‌పూర్ తో మ‌లైకా చ‌నువెంతో ఈ ఫోటోనే చెబుతోంది. ఆ ఇద్ద‌రికీ మిగ‌తావాళ్లంతా బాస‌ట‌గా నిలిచారా? అన్న‌ట్టే ఉందీ ఫోజు. 2019 ఏప్రిల్‌లో మలైకా - అర్జున్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల న‌డుమ ఇలాంటి నైట్ పార్టీలు ఫైర్ యాడెడ్ టు ది పెట్రోల్ అన్న చందంగా అగ్గి రాజేస్తున్నాయి.