Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాలో అర్జున్ కూడా??

By:  Tupaki Desk   |   30 March 2017 5:08 AM GMT
బన్నీ సినిమాలో అర్జున్ కూడా??
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేసుకుంటోంది. కొంత ప్యాచ్ వర్క్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. మే 19న డీజేను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు తన మరుసటి చిత్రం ప్రారంభానికి బన్నీ ముహూర్తం పెట్టేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న 'నా పేరు సూర్య' అనే చిత్రం ప్రారంభించనున్నాడు.

స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ.. నా పేరు సూర్య తీయనున్నాడు. నా ఇల్లు ఇండియా అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఇప్పుడీ చిత్రానికి క్యాస్టింగ్ ఫైనల్ చేసేస్తున్నారు. సీనియర్ యాక్టర్ అర్జున్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురి పేర్లను సంప్రదించిన తర్వాత.. చివరకు ఈ రోల్ కు అర్జున్ అయితేనే సరిపోతాడనే ఉద్దేశ్యంతో స్టోరీ నెరేట్ చేశాడట దర్శకుడు. కథ నచ్చడంతో పాటు.. తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో.. అర్జున్ వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది.

నిజానికి ఈ సీనియర్ నటుడు.. సినిమాల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటాడు. గత కొన్నేళ్ల కాలంలో ఈయన ఒప్పుకున్న రెండో తెలుగు సినిమా ఇది. హను రాఘపూడి డైరెక్షన్ లో నితిన్ హీరోగా రూపొందున్న సినిమాలో కూడా అర్జున్ నటిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/